బాబర్ అజామ్ ను కోహ్లీతో పోల్చిన ఫఖర్ జమాన్.. ఫైర్ అయిన నెటిజన్లు

Fakhar Zaman Compared Babar Azam To Kohli Netizens Are On Fire

పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ అజామ్ జట్టు నుండి తొలగించినందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై ఓపెనర్ ఫఖర్ జమాన్ చేసిన పోస్ట్ ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది. విరాట్ కోహ్లి ఫామ్‌ కోల్పోయి ఇబ్బంది పడినప్పుడు బీసీసీఐ అతడిని జట్టు నుంచి తప్పించలేదని వాఖ్యానించాడు.

జమాన్ X పోస్ట్‌లో ఏముంది?
బాబర్ అజామ్‌ను జట్టు నుండి తొలగించడానికి బోర్డు చెప్పిన కారణాలు చాలా ఆందోళన కలిగిస్తున్నాయి తన X పోస్ట్‌లో ఫఖర్ జమాన్ పేర్కొన్నాడు. విరాట్ కోహ్లీ 2020 నుంచి 2023 వరకు ఫామ్ కోల్పోయాడు. అప్పుడు అతని సగటు 19.33, 28.21, 26.50. కానీ భారత్ అతన్ని బెంచ్ కు పరిమితం చేయలేదు. మనం ఇప్పుడు పాకిస్తాన్ గొప్ప బ్యాట్స్‌మెన్‌ను పక్కనపెట్టడానికి ప్రయత్నిస్తే, అది జట్టుకు ప్రతికూల సందేశాన్ని పంపుతుంది. జట్టులోని కీలక ఆటగాళ్లను పక్కన్న నెట్టడానికి బదులు కాపాడుకోవాలని అని అతను రాశాడు. ఈ ట్వీట్ పాకిస్థాన్ క్రికెట్‌లో కలకలం రేపింది.

కాగా ఇండియన్ క్రికెట్ అభిమానులు బాబర్ ఆజంను విరాట్ కోహ్లీతో పోల్చుతూ ఫఖర్ జమాన్ పోస్టుకు కౌంటర్లు ఇస్తూ పోస్టులు కామెంట్స్ పెడుతున్నారు. విరాట్ కోహ్లీ 22 ఏళ్ల వయసులో ప్రపంచకప్‌ను, 24 ఏళ్ల వయసులో ఛాంపియన్స్ ట్రోఫీని, 26 ఏళ్ల వయసులో టెస్టు కెప్టెన్‌గా ఆస్ట్రేలియాపై 4 సెంచరీలు, 7 డబుల్ సెంచరీలు, ముఖ్యంగా కేవలం 16 నెలల్లో 6 డబుల్ సెంచరీలు సాధించాడు. . విరాట్ కోహ్లితో బాబర్ ఆజంను పోల్చడం సరికాదని పోస్టులు పెడుతున్నారు. విరాట్‌ కోహ్లి ప్రపంచకప్‌, టీ20 ప్రపంచకప్‌, ఛాంపియన్స్‌ ట్రోఫీ గెలిచాడు. అదే బాబర్ ఆజం కేవలం కవర్ డ్రైవ్ లు ఆడుతూ కాలం గడిపాడని విమర్శిస్తున్నారు. ఇది బాబర్ సమస్య, మీరు ఇక్కడ విరాట్ కోహ్లీని ఎందుకు ఉదాహరణగా ఇస్తున్నారు? భారత్‌ను అన్నింటిలోకి లాగే ప్రయత్నం ఎందుకు జరుగుతోందని మరొకరు మండిపడ్డారు.

మండిపడ్డ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు
అటు ఫఖర్ జమాన్ ట్వీట్‌పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సైతం అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఫఖర్ ట్వీట్ పీసీబీకి ఇబ్బందిగా మారిందని, సీరియస్‌గా తీసుకున్నట్లు సమాచారం. అందుకే ఆయనపై బోర్డు చర్యలు తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో పాకిస్థాన్ క్రికెట్‌లో బాబర్ భాగమవుతాడని ఓ అధికారి స్పష్టం చేశారు. బాబర్ ను టెస్టు జట్టును ఎంపిక చేయడం తనకు ఎందుకు చాలా కష్టమైందో వివరించాడు సెలక్షన్ బోర్డు సభ్యుడు అకీబ్ జావేద్… జట్లును చాలా జాగ్రత్తగా జట్టును ఎంపిక చేశాం. 2024-25లో పాకిస్థాన్ జట్టు చాలా సిరీస్‌లు ఆడాల్సి ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని మేము బాబర్ ఆజం, నసీమ్ షా మరియు షాహీన్ షా ఆఫ్రిదీలకు విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించుకున్నామని తెలిపాడు.