భారత్ vs సౌత్ ఆఫ్రికా టీ20 సిరీస్: గాయంతో జస్ప్రీత్ బుమ్రా దూరం, జట్టులోకి మహమ్మద్ సిరాజ్

India vs South Africa T20 Series Mohammad Siraj Replaces Injured Jasprit Bumrah in India T20 Squad, Jasprit Bumrah Ruled Out Of T20 ICC World Cup ,Mohammad Siraj Replaced With Bumrah, India VS South Africa T20 Series, India And South Africa T20 Series, India VS South Africa, T20 Series, SA Captain Temba Bavuma, SA Captain Dean Elgar, Indian Captain Rohit Sharma, KL Rahul (vice-captain), Virat Kohli, Suryakumar Yadav, Deepak Hooda, Rishabh Pant (wicket-keeper), Dinesh Karthik (wicket-keeper), R. Ashwin, Yuzvendra Chahal, Axar Patel, Arshdeep Singh, Mohd. Shami, Harshal Patel, Deepak Chahar, Jasprit Bumrah

భారత్, సౌత్ ఆఫ్రికా జట్ల​ మధ్య ప్రస్తుతం మూడు టీ20ల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 28న తిరువనంతపురంలో జరిగిన తోలి టీ20లో భారత్ జట్టు ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టి 8 వికెట్ల తేడాతో సౌత్ ఆఫ్రికాపై ఘన విజయం సాధించింది. ఇక గౌహతిలో అక్టోబర్ 2న రెండవ టీ20, ఆ తర్వాత ఇండోర్‌లో అక్టోబర్ 4న చివరిదైన మూడో టీ20 జరుగనుంది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్ లో ఆడుతున్న భారత్ టీ20 జట్టులో చోటుచేసుకున్న ఓ మార్పుపై బీసీసీఐ శుక్రవారం ఉదయం ఒక ప్రకటన విడుదల చేసింది. గాయపడిన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా స్థానంలో మహమ్మద్ సిరాజ్ టీ20 జట్టులోకి వచ్చాడని తెలిపారు.

“ఆల్ ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ మిగిలిన సౌత్ ఆఫ్రికాతో టీ20 సిరీస్‌ కోసం గాయపడిన జస్ప్రీత్ బుమ్రా స్థానంలో మహమ్మద్ సిరాజ్‌ని ఎంపిక చేసింది. బుమ్రా వెన్ను గాయంతో ప్రస్తుతం బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు” అని బీసీసీఐ ప్రకటించింది. అయితే త్వరలో జరగబోయే టీ20 ప్రపంచకప్ లో కీలకపాత్ర పోషిస్తాడని భావిస్తున్న జస్ప్రీత్ బుమ్రా గాయపడడంతో అభిమానుల్లో నిరాశ నెలకుంది. ఈ గాయంతో టీ20 ప్రపంచకప్ కు కూడా బుమ్రా దూరం కానున్నట్టు వార్తలు వస్తున్నాయి. టీ20 ప్రపంచకప్ కు మరో రెండు వారాలకుపైగా సమయం ఉండడంతో ప్రపంచ కప్ లో బుమ్రా ఆడతాడా?, లేదా బుమ్రా స్థానంలో సిరాజ్ నే జట్టులో కొనసాగిస్తారా? అనే దానిపై బీసీసీఐ అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.

సౌత్ ఆఫ్రికాతో టీ20 సిరీస్ కు భారత్ జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, యజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, హర్షల్ పటేల్, దీపక్ చాహర్, ఉమేష్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, షాబాజ్ అహ్మద్, మహమ్మద్ సిరాజ్.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here