ఐసీసీ టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్-2022, వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్-2022 ఇవే…ముగ్గురు భారత్ ఆటగాళ్లకు చోటు

ICC Reveals Men's Test ODI Teams of the Year 2022 Shreyas Iyer Siraj are Gets Place in ODI Rishabh Pant in Test,ICC Reveals Men's Test, ODI Teams of the Year 2022, Shreyas Iyer, Siraj are Gets Place in ODI,Rishabh Pant in Test,Mango News,Mango News Telugu,T20 Team Of The Year 2022,Icc Womens T20 Team Of The Year 2022,Icc Team Of The Year 2022,Icc Mens T20 Team Of The Year 2022,Icc Odi Team Of The Year 2022,Icc Test Team Of The Year,Icc T20 Team Of The Decade,Icc Mens T20 Player Of The Year 2022,Icc Womens T20 Team Of The Year 2022,Icc Mens T20 Team Of The Year 2022,Icc T20 Team Of The Year 2019

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మంగళవారం నాడు పురుషుల టెస్టు టీమ్ ఆఫ్ ది ఇయర్-2022, వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్-2022 ను ప్రకటించింది. 2022 క్యాలెండర్ ఇయర్‌ లో టెస్టుల్లో మరియు వన్డేల్లో బ్యాటింగ్, బౌలింగ్, ఆల్ రౌండర్ విభాగాల్లో రాణించి, అందరినీ ఆకట్టుకున్న 11 మంది అత్యుత్తమ ఆటగాళ్లతో ఐసీసీ టీమ్స్ ను ప్రకటించింది. కాగా టెస్టు టీమ్ ఆఫ్ ది ఇయర్ లో భారత్ జట్టు నుంచి స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ మాత్రమే చోటు దక్కించుకున్నాడు. రిషబ్ పంత్ 2021 టెస్ట్ టీమ్ లో కూడా చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. టెస్టు టీమ్ ఆఫ్ ది ఇయర్-2022 కు కెప్టెన్ గా ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ను, వికెట్ కీపర్ గా రిషభ్ పంత్ ను ఐసీసీ ప్రకటించింది.

ఇక వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్-2022 లో భారత్ జట్టు నుంచి ఇద్దరు ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. బ్యాటింగ్ విభాగంలో శ్రేయాస్ అయ్యర్, బౌలింగ్ విభాగంలో మహమ్మద్ సిరాజ్ చోటు దక్కించుకున్నారు. వన్డే జట్టుకు పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ను కెప్టెన్ గా, వికెట్ కీపర్ గా న్యూజిలాండ్ ఆటగాడు టామ్ లాథమ్ ను ఎంపిక చేశారు.

ఐసీసీ టెస్టు టీమ్ ఆఫ్ ది ఇయర్-2022:

  1. ఉస్మాన్ ఖవాజా
  2. క్రైగ్ బ్రాట్ వైట్
  3. మార్నస్ లాబుస్చాగ్నే
  4. బాబర్ అజమ్
  5. జానీ బెయిర్ స్టో
  6. బెన్ స్టోక్స్ (కెప్టెన్)
  7. రిషభ్ పంత్ (వికెట్ కీపర్)
  8. పాట్ కమ్మిన్స్
  9. కసిగో రబడా
  10. నాథన్ లియోన్
  11. జేమ్స్ ఆండర్సన్

ఐసీసీ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్-2022:

  1. బాబర్ అజమ్ (కెప్టెన్)
  2. ట్రావిస్ హెడ్
  3. షాయ్ హోప్
  4. శ్రేయాస్ అయ్యర్
  5. టామ్ లాథమ్ (వికెట్ కీపర్)
  6. సికందర్ రజా
  7. మెహిదీ హసన్
  8. అల్జారీ జోసెఫ్
  9. మహమ్మద్ సిరాజ్
  10. ట్రెంట్ బౌల్ట్
  11. ఆడమ్ జాంపా.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + 3 =