అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) ఆన్‌లైన్ చెస్ ఒలింపియాడ్‌లో భారత్ తొలిసారిగా స్వర్ణ పతకం సాధించింది. రష్యాతో కలిసి సంయుక్తంగా ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ని సొంతం చేసుకుంది. రెండు మ్యాచ్‌లతో కూడిన ఫైనల్ లో తొలి మ్యాచ్‌లో ఆరు గేమ్‌లు డ్రా గా ముగియడంతో ఇరు జట్లూ 3–3 తో సమంగా నిలిచాయి. కాగా రెండో మ్యాచ్ సందర్భంగా దివ్య దేశ్‌ముఖ్ మరియు నిహాల్ సరీన్ ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తున్న సమయంలో ఇంటర్నెట్ అంతరాయం కలిగింది. దీంతో వారిద్దరూ గేమ్‌లను వదులుకోవాల్సి రావడంతో భారత్ ను ఓడినట్లుగా ప్రకటించి, రష్యాను ఫిడే విజేతగా నిర్ణయించింది. అయితే విజయం సాధించే అవకాశం ఉన్నదశలో ఇంటర్నెట్ అంతరాయం కల్గిందని, మళ్లీ చివరి రెండు గేమ్‌లు నిర్వహించాలని ఫిడే కమిటీకి భారత్ అప్పీల్ చేసింది. అప్పీల్ ను సమీక్షించిన అనంతరం ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ టైటిల్ కు భారత్ మరియు రష్యాలను సంయుక్త విజేతలుగా ఫిడే ప్రకటించింది.
ఈ ఛాంపియన్‌షిప్ లో భారత్ తరపున పాల్గొన్న బృందంలో ప్రపంచ మాజీ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్, గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, పెంటేల హరికృష్ణ ఉన్నారు. అలాగే నిహాల్ సరీన్, ప్రజ్ఞానంద, దివ్య దేశ్‌ముఖ్, విదిత్ సంతోష్ గుజరాతి, అరవింద్ చిదంబరం, వైశాలి, భక్తి కులకర్ణి, వంతిక అగర్వాల్ లు సభ్యులుగా ఉన్నారు. భారత్‌ను విజేతగా నిలపడంలో ముఖ్యంగా కోనేరు హంపి కీలక పాత్ర పోషించారు. ఆన్‌లైన్ చెస్ ఒలింపియాడ్‌లో స్వర్ణ పతకం గెలిచిన భారత బృందానికి ప్రధాని నరేంద్ర మోదీ, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సహా పలువురు ప్రముఖులు, క్రీడాకారులు శుభాకాంక్షలు తెలిపారు.
🇷🇺 Russia and India 🇮🇳 are co-champions of the first-ever FIDE Online #ChessOlympiad.
Tournament’s website: https://t.co/bIcj0hRMek#chess #IndianChess #шахматы pic.twitter.com/gP4sULP2kr
— International Chess Federation (@FIDE_chess) August 30, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu