బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ ఫామ్‌పై రికీ పాంటింగ్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి కేంద్రబిందువుగా మారాయి. భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా గంభీర్ వ్యాఖ్యలపై పాంటింగ్ స్పందించాడు.
కోహ్లీని అపహాస్యం చేసేందుకు విమర్శలు చేయలేదన్నాడు. కోహ్లీ ఓ క్లాస్ క్రికెటర్ అని అన్నాడు. అతడి ఫామ్ పై మాత్రమే తాను ఆందోళన వ్యక్తం చేసినట్లు చెప్పుకొచ్చాడు. ఇదే విషయాన్ని కోహ్లీని అడిగినా అతడు అదే మాటను అంటాడని అన్నాడు. అంతకముందు వరుస శతకాలతో అదరగొట్టిన అతడు ఇప్పుడు అదే స్థాయిలో ఆడలేకపోతున్నాడు. ఇది అతడిని కించపరిచినట్లు కాదు. అని చెప్పాడు.
గతంలో ఆస్ట్రేలియాలో అతడు అద్భుతంగా ఆడాడని, ఈ సారి కూడా ఆ స్థాయిలో అతడు చెలరేగే అవకాశం ఉందన్నాడు. వాస్తవానికి గంభీర్ వ్యాఖ్యలకు తానేమి ఆశ్చర్యపోనని, అయితే.. టీమ్ఇండియా హెడ్ కోచ్‌గా ఉంటూ అతడు కామెంట్స్ చేయడమే తనను సర్‌ప్రైజ్ చేసిందని పాంటింగ్ చెప్పాడు.
ఇక ఈ వివాదంపై టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కూడా గంభీర్‌పై విమర్శలు గుప్పించాడు. గంభీర్‌ను మీడియా సమావేశాలకు దూరంగా ఉంచాలని, రోహిత్ శర్మ లేదా అజిత్ అగార్కర్‌లాంటి వారు మీడియా సమావేశాలకు హాజరైతే బెటర్ అని బీసీసీఐని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు. కాగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్ ప్రారంభం అవుతోంది. మొదటి టెస్ట్ నవంబర్ 22న పెర్త్ వేదికగా జరగనుంది. భారత జట్టు ఇప్పటికే ఆస్ట్రేలియాలో ప్రాక్టీస్ ప్రారంభించింది.