టీమిండియా కొత్త కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన గౌతమ్ గంభీర్ ఈరోజు తన తొలి మీడియా సమావేశం నిర్వహించి పలు విషయాలపై ఓపెన్‌గా మాట్లాడాడు. గంభీర్‌తో పాటు టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ కూడా పాల్గొన్నాడు. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. శ్రీలంకతో వన్డే సిరీస్‌కు రవీంద్ర జడేజాను ఎందుకు ఎంపిక చేయలేదో వివరణ ఇచ్చారు. శ్రీలంకతో జరిగే సిరీస్‌కు స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను ఎంపిక చేయడం లేదని సెలక్షన్ కమిటీ చీఫ్ అజిత్ అగార్కర్ స్పష్టం చేశారు. మేము ఈ సిరీస్ నుంచి రవీంద్ర జడేజాను తొలగించలేదు, బదులుగా అతనికి విశ్రాంతి ఇచ్చాము. ఎందుకంటే రానున్న రోజుల్లో ముఖ్యమైన టెస్టు సిరీస్ ఆడాల్సి ఉంది. అతను అలాంటి క్రికెట్ ఆడగల సమర్థుడు. అతను మా జట్టుకు ముఖ్యమైన ఆటగాడని అగార్కర్ స్పష్టం చేశాడు.
రన్ మెషీన్ విరాట్ కోహ్లి తో తన రిలేషన్ షిప్ గురించి వస్తున్న పుకార్లపై గంభీర్ సోమవారం మాట్లాడుతూ, “నాకు, కోహ్లీకి మధ్య ఉన్న సంబంధం మా ఇద్దరికీ సంబందించనిద అంతే కాని టీఆర్‌పీ కోసం కాదు. ఐపీఎల్‌లో గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లి చాలాసార్లు గొడవ పడ్డారు. అయితే జులై 27 నుంచి ప్రారంభమయ్యే శ్రీలంక టూర్‌లో వీరిద్దరూ కలిసి పని చేయనున్నారు. అదే సమయంలో, 2027 ICC ODI ప్రపంచ కప్ టోర్నమెంట్‌లో టీమిండియా లెజెండరీ క్రికెటర్లు విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారా అనే ప్రశ్నకు కూడా సమాధానం ఇచ్చారు. రాహుల్ ద్రవిడ్ మార్గదర్శకత్వంలో భారత క్రికెట్ జట్టు 2024 ICC T20 ప్రపంచ కప్‌లో ఛాంపియన్‌గా నిలిచింది. దీని తర్వాత ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగిసింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా కూడా అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు వీడ్కోలు పలికారు.
ముఖ్యంగా విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలకు ఇప్పటికే 35 ఏళ్లు దాటడంతో వారి క్రికెట్ భవిష్యత్తుపై ప్రశ్నలు మొదలయ్యాయి. ఈ ఇద్దరు క్రికెటర్లు గౌతమ్ గంభీర్ మార్గదర్శకత్వంలో ఇంకా ఎన్నాళ్లు క్రికెట్ ఆడతారు? 2027 ICC ODI ప్రపంచ కప్ టోర్నమెంట్ వరకు అతను భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తాడా అనే ప్రశ్నలకు గంభీర్ స్పష్టమైన సమాధానం ఇచ్చాడు. టీ20 వరల్డ్‌కప్ అయినా, వన్డే ప్రపంచకప్ అయినా.. పెద్ద మ్యాచ్‌ల్లో ఏదైనా రాణించగలమని కోహ్లీ, రోహిత్ ఇప్పటికే చూపించారని గంభీర్ అన్నాడు. ఈ ఇద్దరు క్రికెటర్లలో ఇంకా చాలా క్రికెట్ ఆడగలిగే సత్తా ఉందన్నారు. ముఖ్యంగా ఈ ఏడాది చివర్లో ఆసీస్ పర్యటనలో బోర్డర్-గవాస్కర్ టెస్ట్ సిరీస్. అదేవిధంగా 2025లో ICC ఛాంపియన్స్ ట్రోఫీ కీలకం కాబోతుందన్నాడు. ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటే ప్రపంచకప్‌ను కూడా ఆడతారన్న తనకు ఉందన్నాడు టీమ్ ఇండియా కొత్త కోచ్ గంభీర్ అన్నారు. ఎవరు ఎన్ని సంవత్సరాలు ఆడాలి, ఎవరు రిటైర్మెంట్ ఇవ్వాలి అనేది వారి వ్యక్తిగత నిర్ణయమన్నాడు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF