అడిలైడ్‌లో డిసెంబరు 6న ఆస్ట్రేలియాతో జరగనున్న పింక్ బాల్ టెస్టు కోసం టీమిండియా తన తుది జట్టులో మార్పులు చేసేందుకు సిద్ధమవుతోంది. భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్, ఈ టెస్టుకు సంబంధించి కీలకమైన మార్పులపై తన జోస్యం వెల్లడించారు. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ జట్టులోకి తిరిగి రావడం ఖాయమని, దీంతో కొంతమంది ప్లేయర్లు ప్లేయింగ్ ఎలెవన్ నుంచి తప్పుకోనున్నారని ఆయన అంచనా వేశారు.
రోహిత్ తన రెండవ బిడ్డ పుట్టిన కారణంగా మొదటి టెస్టుకు దూరంగా ఉన్నాడు. గిల్ కూడా బొటనవేలి గాయంతో తొలి టెస్టు ఆడలేదు. ఇప్పుడు వీరిద్దరి రాకతో భారత జట్టు మరింత బలంగా మారనుంది.
గవాస్కర్ ప్రెడిక్షన్స్
గవాస్కర్ ప్రకారం, రోహిత్ శర్మ, గిల్ జట్టులోకి రావడం వల్ల దేవ్‌దత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్ ప్లేయింగ్ ఎలెవన్ నుంచి బయటకివెళ్తారు. బ్యాటింగ్ ఆర్డర్‌లోనూ మార్పులు జరుగుతాయని చెప్పారు. రోహిత్ శర్మ ఓపెనింగ్ చేస్తాడు, గిల్ మూడో స్థానంలో వస్తాడు. అలాగే వాషింగ్టన్ సుందర్ స్థానంలో రవీంద్ర జడేజా జట్టులోకి రావడం ఖాయమని గవాస్కర్ అభిప్రాయపడ్డారు.
గవాస్కర్ అంచనా వేసిన తుది జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
పింక్ బాల్ టెస్టులో విజయం పై దృష్టి
తొలి టెస్టులో విజయం సాధించిన టీమిండియా రెండో టెస్టులో కూడా ఆధిపత్యం సాధించేందుకు నూతన వ్యూహాలను రూపొందిస్తోంది. రోహిత్, గిల్ రాకతో జట్టు మరింత బలపడుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.