ఆస్ట్రేలియాతో రెండో వన్డేకు రిషబ్ పంత్ ఔట్

2020 Latest Sport News, 2020 Latest Sport News And Headlines, India vs Australia, India vs Australia 2nd ODI, India vs Australia Match, latest sports news, latest sports news 2020, Mango News Telugu, sports news, Wicket Keeper Rishabh Pant Ruled Out of 2nd ODI

భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జనవరి 14న వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక రెండో వన్డే జనవరి 17, శుక్రవారం నాడు రాజ్‌కోట్‌లో జరగనుంది. అయితే ఈ వన్డే మ్యాచ్ కు భారత్ వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ దూరమయ్యాడు. తొలి వన్డేలో 44వ ఓవర్లో ఆసీస్‌ పేసర్‌ పాట్ కమిన్స్‌ వేసిన బౌన్సర్‌ పంత్‌ హెల్మెట్‌కు బలంగా తాకింది. దీంతో ఇన్నింగ్స్ విరామ సమయంలో పంత్ చికిత్స తీసుకోవలసి వచ్చింది. అలాగే రెండో ఇన్నింగ్స్‌లో మైదానంలోకి రాలేదు. పంత్ బదులు కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా మనీశ్‌ పాండే ఫీల్డింగ్‌ చేయగా, కేఎల్‌ రాహుల్‌ వికెట్‌ కీపింగ్‌ చేశాడు. ఈ నేపథ్యంలో పంత్‌ పూర్తిగా కోలుకోపోవడంతో రెండో వన్డేకు విశ్రాంతి ఇచ్చారు. మరోవైపు పునరావాస ప్రోటోకాల్ సమయంలో పంత్ స్పందించేదాన్ని బట్టి చివరి వన్డే కోసం ఎంపిక చేయాలో లేదో నిర్ణయిస్తామని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. తోలి వన్డేలో ఘోరపరాజయం తర్వాత ఆస్ట్రేలియాపై పట్టు సాధించడానికి భారత్ జట్టు కసరత్తు చేస్తుంది. మిగిలిన రెండు వన్డేలలో విజయం సాధించి సిరీస్ గెలుచుకోవడం కోసం భారత్ ఆటగాళ్లు సిద్దమవుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + five =