బ్రిస్బేన్‌లోని గబ్బా క్రికెట్ మైదానం అనేక చారిత్రాత్మక టెస్ట్ మ్యాచ్‌లకు సాక్షిగా నిలిచిందన్న విషయం క్రికెట్ లవర్స్‌కు బాగా తెలుసు. ఇప్పటి వరకు గాబా క్రికెట్ మైదానంలో ఎన్నో అద్భుతమైన టెస్టు మ్యాచ్‌లు జరిగాయి.ఇయాన్ బోథమ్ గాబా క్రికెట్ మైదానంలోనే తన చివరి గొప్ప ఇన్నింగ్స్ ఆడడం అతని ఫ్యాన్స్‌కు ఇంకా కళ్లముందే ఉంటుంది.
దివంగత షేన్ వార్న్ కూడా ఈ మైదానంలోనే తన కెరీర్లో అత్యుత్తమ స్పెల్ బౌలింగ్ చేశాడు. పీటర్ సిడిల్ తన పుట్టినరోజు నాడు..ఈ మైదానంలోనే హ్యాట్రిక్ సాధించాడు. ఇది కాకుండా, 2021 టెస్ట్ సిరీస్‌లో ఆస్ట్రేలియాను ఓడించి భారత్ సరికొత్త రికార్డ్ సృష్టించింది. అయితే, ఇప్పుడు గబ్బాలో టెస్ట్ క్రికెట్ భవిష్యత్తు ప్రమాదంలో పడినట్లు తెలుస్తోంది.
ఈఎస్పీఎన్ క్రిక్ఇన్పో ప్రకారం, క్వీన్స్లాండ్ గవర్నమెంట్ క్రికెట్ ఆస్ట్రేలియాతో కేవలం రెండేళ్ల పాటు హోస్టింగ్ అగ్రిమెంట్‌పై సంతకం చేసింది. దీని ప్రకారం భారత్‌తో జరగనున్న టెస్టు సిరీస్, అలాగే వచ్చే ఏడాది యాషెస్ సిరీస్ తర్వాత గాబా మైదానంలో టెస్టు మ్యాచ్‌లు నిర్వహించడం కష్టం అన్నమాట. దీని తర్వాత గబ్బా మైదానంలో టెస్ట్ క్రికెట్ ఎప్పుడు తిరిగి వస్తుందో ఊహించలేం.
2025-26 యాషెస్‌లో ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లండ్ పోటీ పడినప్పుడు, గాబాలో అప్పుడు వరుసగా 49వ టెస్ట్ మ్యాచ్ అవుతుంది. అయితే, గబ్బా మైదానంలో టెస్టుల్లో హాఫ్ సెంచరీ చేయడం సాధ్యం కాదు. దీని తర్వాత ఇక్కడ టెస్టు మ్యాచ్‌లు ఉండకపోవచ్చు. ఇంగ్లండ్‌తో గబ్బా మైదానంలో వన్డే, టీ20 మ్యాచ్‌లు ఆడవచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి.
గబ్బా గ్రౌండ్ జీవితకాలం 2030 వరకు మాత్రమే. 2030 తర్వాత 2032 ఒలింపిక్స్ కూడా బ్రిస్బేన్‌లో జరగనున్నాయి. ముందుగా దీన్ని పూర్తిగా మొదటి నుంచి పునర్నిర్మించాలని ప్లాన్ చేశారు. అయితే, ఎక్కువ వ్యయం వల్ల, ఈ ప్రణాళిక నిలిపివేసి.. ఇప్పుడు కేవలం ఆ మైదానం దాని పునరుద్ధరణ చేయడానికి ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
గబ్బా స్టేడియంను ముందుగా పునర్నిర్మించాలని అలన్ బోర్డర్ డిమాండ్ చేసింది. గతంలో కూడా ఆస్ట్రేలియా జట్టు మాజీ కెప్టెన్ అలన్ బోర్డర్ ఒలింపిక్స్‌కు ముందు గబ్బా స్టేడియంను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.గబ్బా క్రికెట్ స్టేడియంకు సంబంధించి ప్రభుత్వం వద్ద కచ్చితమైన ప్రణాళికలు లేవని అలన్ బోర్డర్ చెప్పారుకొచ్చారు. అందుకే పనులు జరగడం లేదని.. అయినా కూడా, ఇది చాలా విచారకరమని ఆయన అన్నారు. ఎందుకంటే 2032 మెల్బోర్న్ ఒలింపిక్స్‌లో గబ్బాని ఎలా ఉపయోగించవచ్చనే దానిపై ఫ్యూచర్లో కచ్చితమైన ప్రణాళికను కలిగి ఉండాలని అలన్ బోర్డర్ చెప్పుకొచ్చాడు.