భారత్-ఆస్ట్రేలియా: మొదటి టీ20లో భారత్ ఘనవిజయం

India vs Australia 1st T20: India Beat Australia by 11 Runs,India vs Australia Highlights 1st T20,IND vs AUS 1st T20 Highlights,1st T20I,India vs Australia Highlights, 1st T20I At Canberra,India vs Australia 1st T20 Highlights,India Beat Australia By 11 Runs,IND vs AUS T20 Highlights,IND Vs AUS,1st T20I Highlights,1st T20 Match India vs Australia Highlights,T20 2020,1st T20,Match,India,Australia,Highlights,T20 2020,India vs Australia Match,Australia vs India,1st T20I,India vs Australia 1st T20 Match Full Highlights,Ind V Aus 1st T20 Full Highlights,Aus v Ind Match T20 Highlights,Today Cricket Match Highlights,Cricket

భారత్-ఆస్ట్రేలియా‌ మధ్య మూడు టీ20ల సిరీస్ లో భాగంగా కాన్ బెర్రా లోని మానుక ఓవల్ స్టేడియంలో శుక్రవారం నాడు జరిగిన తోలి టీ20లో 11 పరుగుల తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది. ముందుగా టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఓపెనర్ శిఖర్ ధావన్ (1) పరుగుకే అవుట్ అవ్వగా మరో ఓపెనర్ కేఎల్‌ రాహుల్‌(51: 40 బంతుల్లో 5×4, 1×6) రాణించాడు. ఇక కెప్టెన్ విరాట్‌ కోహ్లి(9), శాంసన్(23 ), మనీష్ పాండే (2), హార్దిక్ పాండ్యా (16), వాషింగ్టన్ సుందర్(7) తక్కువ పరుగులకే అవుట్ అవ్వగా, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా (44: 23 బంతుల్లో 5×4, 1×6) రాణించి జట్టును ఆదుకున్నాడు. ఆఖరి ఓవర్లలో జడేజా ఆసీస్ బౌలర్లును సమర్ధంగా ఎదుర్కోవడంతో భారత్ మెరుగైన స్కోర్ సాధించగలిగింది. ఆస్ట్రేలియా బౌలర్లలో హెన్రిక్స్ 3, స్టార్క్ 2, ఆడమ్ జంపా 1, స్వీపన్ ఒక వికెట్‌ తీశారు.

అనంతరం 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు 20 ఓవర్లలో ఐదు వికెట్ల కోల్పోయి 150 పరుగులు చేసింది. ఓపెనర్లు అర్కీ షార్ట్ (34), ఫించ్ (35) పరుగులతో జట్టుకు శుభారంభాన్ని అందించగా, హెన్రిక్స్‌ (30) పరుగులతో జట్టు విజయం కోసం పోరాడాడు. అయితే కీలక సమయాల్లో భారత్ బౌలర్లు వికెట్లు తీసి ఆసీస్ ను కట్టడి చేశారు. ఈ మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ లో రాణించిన రవీంద్ర జడేజాకు తలకు గాయం కావడంతో, జడేజా బదులుగా కంకషన్ సబ్స్టిట్యూట్ గా వచ్చిన చాహల్ రెండో ఇన్నింగ్స్ లో బౌలింగ్ చేశాడు. మూడు వికెట్లు తీసి భారత విజయంలో కీలక పాత్ర పోషించి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇక మిగిలిన బౌలర్లలో నటరాజన్ 3, దీపక్ చాహర్ ఒక వికెట్‌ తీశారు. ఇక ఇరుజట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ డిసెంబర్ 6న జరగనుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − thirteen =