ఐపీఎల్ 2020: స్లో ఓవర్ రేట్ కారణంగా కెప్టెన్ విరాట్ కోహ్లీకి 12 లక్షల జరిమానా

IPL 2020, kings XI punjab, KXIP, KXIP vs RCB, KXIP vs RCB IPL 2020, RCB skipper Kohli fined Rs 12 lakh, RCB skipper Virat Kohli, Royal Challengers Bangalore, Slow Over Rate Offence Against KXIP, virat kohli, Virat Kohli Fined Rs 12 Lakhs, Virat Kohli Fined Rs 12 Lakhs For Slow Over Rate Offence Against KXIP

ఐపీఎల్-2020 లో భాగంగా దుబాయి ఇంటర్నేషనల్ స్టేడియంలో సెప్టెంబర్ 24, గురువారం నాడు కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ టి20 మ్యాచులో స్లో ఓవర్ రేట్ కొనసాగించినందుకు బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీకి 12 లక్షలు జరిమానా విధించారు. ఈ మ్యాచ్ లో కెప్టెన్ కోహ్లీ మొదటగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. మొదటి ఇన్నింగ్స్ ఒక గంట 51 నిమిషాలు పాటుగా కొనసాగింది. దీంతో మినిమమ్ ఓవర్ రేట్ ఉల్లంఘనలకు సంబంధించిన ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం, ఈ సీజన్‌లో చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేసిన మొదటి తప్పిదంలో భాగంగా కెప్టెన్ కోహ్లీకి 12 లక్షల రూపాయల జరిమానా విధించారు.

మరోవైపు ఈ మ్యాచ్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ కేఎల్‌ రాహుల్‌ (132-14×4,7×6) భారీ శతకంతో చెలరేగడంతో ఆ జట్టు బెంగళూరుపై 97 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సీజన్లో కేఎల్ రాహుల్ మొదటి సెంచరీ నమోదు చేయడమే కాకుండా, ఐపీఎల్ లో అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన భారత ఆటగాడిగా నిలిచాడు. అలాగే ఐపీఎల్‌లో వేగంగా 2వేల పరుగులు సాధించిన రికార్డును కూడా దక్కించుకున్నాడు. గతంలో ఈ రికార్డ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌ పేరిట ఉంది.‌ ఐపీఎల్‌లో 2వేల పరుగులను సచిన్ 63 ఇన్నింగ్స్‌లో చేరుకుగా, కేఎల్‌ రాహుల్‌ 60 ఇన్నింగ్స్‌ లోనే 2వేల పరుగులు సాధించాడు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + eleven =