ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లీగ్‌లు పుట్టుకొచ్చాయి. ఆ కోవలో భాగంగానే మూడు సంవత్సరాల క్రితం దక్షిణాఫ్రికా వేదికగా SA20 లీగ్ మొదలైంది. గత రెండు సీజన్లలో సన్‌రైజర్స్ ఈస్టర్న్ క్యాప్ టైటిల్ సాధించింది. ఈ ఏడాది జనవరి 9న మూడో సీజన్ ప్రారంభమైంది. అయితే ఈసారి నిర్వహకులు కొత్త తరహా ఆలోచనతో ముందుకొచ్చారు.
అభిమానుల కోసం వినూత్న ఆఫర్
దక్షిణాఫ్రికా టీ20 లీగ్ నిర్వహకులు మ్యాచ్‌ను మరింత ఆసక్తికరంగా మార్చేలా వినూత్న ఆఫర్ ప్రకటించారు. మ్యాచ్ చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు బ్యాటర్ కొట్టిన బంతిని ఒంటిచేత్తో పట్టుకుంటే రూ.90 లక్షల నగదు బహుమతిని అందిస్తామని తెలిపారు. ఈ ఆఫర్ మ్యాచ్‌లను ఉత్కంఠభరితంగా మార్చడమే కాకుండా స్టేడియంలో ప్రేక్షకుల రద్దీని పెంచుతోంది.
కేన్ విలియమ్సన్ షాట్‌కు ఊహించని ట్విస్ట్
టోర్నీలో డర్బన్ సూపర్ జెయింట్స్, ప్రిటోరియా క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో కేన్ విలియమ్సన్ కొట్టిన భారీ షాట్ నేరుగా ప్రేక్షకుల్లోకి వెళ్లింది. ఆ సమయంలో మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఓ అభిమాని, ఒంటిచేత్తో ఆ క్యాచ్‌ను పట్టాడు. ఆ క్యాచ్ అతడికి కేవలం క్రికెట్ జ్ఞాపకం మాత్రమే కాదు, రూ.90 లక్షల బహుమతిని కూడా తెచ్చిపెట్టింది.
ఆ అభిమాని క్యాచ్ పట్టిన తర్వాత ప్రపంచ జయించినట్లుగా సంబరాలు జరుపుకున్నాడు. పక్కనే ఉన్న అభిమానులు అతడిని అభినందించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టోర్నీ ప్రారంభం రెండే రోజుల్లోనే ఇద్దరు అభిమానులు రూ.90 లక్షల బహుమతి గెలుచుకున్నారు. మరి ఈ టోర్నీ ముగిసే నాటికి ఇంకా ఎన్ని క్యాచ్‌లు పట్టి లక్షాదికారులు అవుతారో చూడాలి.
You’ll want to stick around to the end for this one… 👀
We’ve got another @Betway_za Catch 2 Million WINNER! 💰🎉#BetwaySA20 #DSGvPC #WelcomeToIncredible pic.twitter.com/hDYH4HKYVs— Betway SA20 (@SA20_League) January 10, 2025