ఐసీసీ మహిళా క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా స్మృతి మందాన ఎంపిక

ICC Awards, icc decade awards, icc player of the year, ICC Women’s Cricketer, ICC Women’s Cricketer of the Year, India opener Smriti Mandhana wins Women’s Cricketer of The Year award for 2021, India’s Smriti Mandhana named ICC Women’s Cricketer, Indian batter Smriti Mandhana, Indian batter Smriti Mandhana named ICC Women’s Cricketer, Indian opener Smriti Mandhana, Mango News, Smriti Mandhana Named ICC Women’s Cricketer, Smriti Mandhana Named ICC Women’s Cricketer of the Year, Smriti Mandhana wins ICC women’s Cricketer of the Year

ఇండియన్ స్టార్ క్రికెట్ క్రీడాకారిణి స్మృతి మందాన ఐసీసీ మహిళా క్రికెటర్ ఆఫ్ ది ఇయర్-2021గా రేచెల్ హేహో-ఫ్లింట్ ట్రోఫీని గెలుచుకుంది. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సోమవారం నాడు ప్రకటన చేసింది. 2021లో మొత్తం 22 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 38.86 సగటుతో ఒక సెంచరీ, ఐదు అర్ధ సెంచరీలతో స్మృతి మందాన 855 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగిన సిరీస్ లో భారత్ మొత్తం ఎనిమిది మ్యాచ్‌ ఆడగా కేవలం రెండింటిని మాత్రమే గెలుచుకుంది. అయితే ఈ రెండు విజయాల్లో మందాన ప్రధాన పాత్ర పోషించింది. రెండో వన్డేలో 158 పరుగులను భారత్ చేజ్ చేసే క్రమంలో మందాన 80 పరుగులు చేసింది, అలాగే చివరి టీ20లో 48 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి, విజయంలో కీలక పాత్ర పోషించింది.

ఇంగ్లండ్‌తో జరిగిన ఏకైక టెస్టు డ్రాగా ముగియగా, తొలి ఇన్నింగ్స్‌లో ఆమె 78 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. ఇక భారత్ ఆడిన తొలి మహిళల డే-నైట్ టెస్టులో ఆస్ట్రేలియాపై 127 పరుగులతో చేసి తొలి సెంచరీ సాధించింది. మందాన తన తొలి సెంచరీని సుదీర్ఘ ఫార్మాట్‌ అయిన టెస్టుల్లో చేసి చిరస్మరణీయమైన ప్రదర్శనగా మార్చుకుంది. అలాగే ఆ టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగియగా స్మృతి మందాన ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికైంది. మరోవైపు ఐసీసీ మెన్స్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ ఎంపికైనట్టు ఐసీసీ ప్రకటించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × five =