టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన ఫిట్‌నెస్‌పై వచ్చే విమర్శల పై కాస్త గట్టిగానే స్పందించాడు. క్రికెట్ మైండ్‌సెట్ పరంగా తాను ఇంకా యువకుడినేనని పేర్కొన్న రోహిత్ శర్మ.. తాను 500 అంతర్జాతీయ మ్యాచ్‌ల మార్క్‌ను టచ్ చేయబోతున్నానని, ఫిట్‌నెస్ లేకుండానే ఇన్ని మ్యాచ్‌లు ఆడగలిగానా అని ప్రశ్నించాడు. అయితే, వయసు మీరిన కారణంగానే టీ20లకు వీడ్కోలు పలికినట్టు అభిమానులు భావిస్తున్నారంటూ ఓ ఇంటర్వ్యూలో శర్మను యాంకర్ ప్రశ్నించాడు. 17 ఏళ్ల నుంచి ఆడుతూ, 500 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లకు చేరువ కావడం చిన్న విషయం కాదని పేర్కొన్నాడు.
టీ20 వరల్డ్‌కప్ గెలిచిన తర్వాత 37 ఏళ్ల రోహిత్ పొట్టిఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కానీ, కెరీర్‌లో ఉచ్ఛదశలో అదీ వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన సమయంలో రిటైర్మెంట్ ప్రకటించడం తగిన సమయమని తాను భావించినట్టు హిట్‌మ్యాన్ చెప్పాడు. 17 ఏళ్ల పాటు పొట్టి ఫార్మాట్‌ను ఆస్వాదించా. ఇక చాలనిపించింది. వరల్డ్‌కప్ గెలిచిన తర్వాత వీడ్కోలు నిర్ణయం ప్రకటించడానికి అంతకంటే గొప్ప సమయం దొరకదని భావించా. ఆటలో ఎదురయ్యే సవాళ్లను డీల్ చేయడంలో నేనింకా యువకుడినని చెప్పాడు.
ప్రపంచ వ్యాప్తంగా చాలా తక్కువ మంది క్రికెటర్లు మాత్రమే ఈ మార్క్‌ను టచ్ చేశారు. ఇంత కాలం పాటు కొనసాగాలంటే జీవన శైలిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలి. ఫిట్‌నెస్ చూసుకోవాలి, మెదడును నియంత్రణలో ఉంచుకోవాలి, స్వీయ సాధన, ఇలా చాలా చేయాలి. మ్యాచ్‌కు ఎలా సిద్ధమయ్యామనేది చాలా ముఖ్యమైనది. ఏదేమైనా మ్యాచ్ కోసం 100 శాతం రెడీగా ఉండి, విజయం సాధించేలా ప్రదర్శన చేయాల్సిందే. దీని వెనక ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడం కీలక పాత్ర పోషిస్తుంది” అని రోహిత్ చెప్పుకొచ్చాడు. కాగా, ప్రపంచ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి ఇప్పటి వరకూ కేవలం 10 మంది క్రికెటర్లు మాత్రమే 500 ఇంటర్నేషనల్ మ్యాచులు ఆడారు. ఇందులో నలుగురు భారత క్రికెటర్లు ఉన్నారు. ప్రస్తుతం 485 మ్యాచ్‌లతో రోహిత్ ఆ మైలురాయికి దగ్గరగా ఉన్నాడు.
. ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్ ఆడుతున్న రోహిత్ శర్మ.. కోచ్ గంభీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. గంభీర్ ఎవరికీ తల వంచడని చెప్పుకొచ్చాడు. టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పని చేశాడు. ఇప్పుడు గౌతమ్ గంభీర్ ఆ బాధ్యతలు చేపట్టాడు. అయితే గంభీర్ ఎవరికీ తలవంచే మనిషి కాదు. చివరి వరకు పోరాడాలని బలంగా భావిస్తాడు. దేశం కోసం అతను ఎన్నో కీలకమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఇప్పుడు అతనితో కలిసి పని చేస్తున్నా. అతని పర్యవేక్షణలో నేను ఆడుతూ జట్టును ముందుకు నడిపించడమే కెప్టెన్‌గా నా బాధ్యత. సహచర ఆటగాళ్ల నుంచి అత్యుత్తమ ప్రదర్శన బయటకు తీయాలి. ప్రస్తుతం భారత క్రికెట్ డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం చాలా బాగుంది. ఒకరికొకరు అండగా ఉంటూ.. స్ఫూర్తి నింపుకోవడంపై దృష్టిసారించారు.