ఐపీఎల్‌-2022: ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన మొదటి జట్టుగా నిలిచిన గుజరాత్ టైటాన్స్

Gujarat Titans Become the First Team to Qualify for IPL 2022 Playoffs, Gujarat Titans Become the First Team to Qualify for Playoffs, Gujarat Titans Become the First Team to Qualify for Playoffs Of IPL 2022, Gujarat Titans to Qualify for Playoffs, Gujarat Titans became the first team to qualify for the playoffs, Gujarat Titans on Tuesday became the first team to qualify for the playoffs after registering their ninth win of the campaign, IPL 2022 Playoffs, 2022 IPL Playoffs, IPL-2022, 2022 IPL, TATA IPL 2022, 2022 TATA IPL, Tata IPL, Indian Premier League, Indian Premier League News, Indian Premier League Latest News, Indian Premier League Latest Updates, Indian Premier League Live Updates, Cricket, Cricket Latest News, Cricket Live Updates, Mango News, Mango News Telugu,

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-2022 లీగ్ మ్యాచ్‌లు ఉత్కఠభరితంగా సాగుతున్నాయి. మే 22వ తేదీతో లీగ్ మ్యాచులు ముగియనుండగా, ప్లేఆఫ్‌ మ్యాచులు మరియు ఫైనల్ మే 24 నుండి మే 29 వరకు కోల్‌కతా, అహ్మదాబాద్‌లలో జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌-2022లో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన మొదటి జట్టుగా గుజరాత్ టైటాన్స్ జట్టు నిలిచింది. గుజరాత్ టైటాన్స్ జట్టు ఈ ఏడాదే ఐపీఎల్ లో కొత్తగా అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. గుజరాత్ టైటాన్స్ జట్టుకు కెప్టెన్ గా టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా వ్యవహరిస్తుండగా, ఈ సీజన్ లో ఇప్పటివరకు ఈ జట్టు సంచలన విజయాలను నమోదు చేసింది. ఇప్పటికి 12 మ్యాచులు ఆడిన గుజరాత్ టైటాన్స్ 9 విజయాలు సాధించి 18 పాయింట్స్, +0.376 నెట్ రన్ రేటుతో పాయింట్స్ టేబుల్ లో అగ్రస్థానంలో నిలిచి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది.

గుజరాత్ టైటాన్స్ జట్టులో కెప్టెన్ హార్ధిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్, శుబ్ మన్ గిల్, రాహుల్ తేవాటియా బ్యాటింగ్ లో రాణిస్తుండగా, మహమ్మద్ షమి, రషీద్ ఖాన్, యాష్ దయాల్ బౌలింగ్ లో సత్తా చాటుతున్నారు. మే 10, మంగళవారం రాత్రి లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో 62 పరుగుల తేడాతో గుజరాత్ జట్టు విజయం సాధించింది. మరోవైపు ఈ ఏడాదే అరంగేట్రం చేసిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు కూడా ఇప్పటికి 12 మ్యాచులు ఆడి 8 విజయాలతో 16 పాయింట్స్, +0.385 నెట్ రన్ రేటుతో పాయింట్స్ టేబుల్ లో రెండో స్థానంలో నిలిచింది. ఇక లక్నో జట్టుకు కూడా ప్లేఆఫ్స్‌ లో స్థానం దాదాపు ఖరారు అయినట్టే. ఇక మిగిలిన రెండు స్థానాలకు రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఎక్కువ అవకాశాలు ఉండగా, ఢిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ కూడా వరుస విజయాలు, నెట్ రన్ రేట్ మెరుగుపర్చుకుంటే ప్లేఆఫ్స్‌ చేరుకునే అవకాశాలు ఉన్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − sixteen =