దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియా శుభారంభం చేసింది. సంజూ శాంసన్ సెంచరీ తో కదం తొక్కడంతో మొదటి టీ 20 మ్యాచ్ లో టీమిండియా 61 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టుపై విజయం సాధించింది. టీ20ల్లో భారత్‌కు ఇది వరుసగా 11వ విజయం.
సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికా పర్యటనను విజయంతో ప్రారంభించింది. నాలుగు టీ20ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం (నవంబర్ 08) దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన టీమిండియా దక్షిణాఫ్రికాకు 203 పరుగులు టార్గెట్ విధించింది. కానీ భారత బౌలర్ల ముందు దక్షిణాఫ్రికా పూర్తి 20 ఓవర్లు కూడా ఆడలేకపోయింది. 17.5 ఓవర్లలలోనే దక్షిణాఫ్రికా కేవలం 141 పరుగులకు ఆలౌటైంది. డర్బన్‌లో టీ20లో భారత్‌కు ఇది ఐదో విజయం కాగా, టీ20ల్లో వరుసగా 11వ విజయం. ఈ విజయంతో టీమిండియా సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.
భారీ టార్గెట్ ను ఛేదించేందుకు బరిలోకి దిగిన సఫారీ బ్యాటర్లు ఆశించిన స్థాయిలో ఆడలేకపోయారు. టీమిండియా స్పిన్నర్లు రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి దెబ్బకు మిగిలిన బ్యాట్స్‌మెన్స్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. వికెట్ కీపర్ అండ్ కీపర్ హెన్రిక్ క్లాసెన్ 25, గెరాల్డ్ కోయెట్జీ 23, ర్యాన్ రికెల్టన్ 21 పరుగులు చేశారు.. ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్ నిరాశపర్చారు. టీమిండియా తరఫున వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ చెరో 3 వికెట్లు తీశారు. అవేష్ ఖాన్ రెండు వికెట్లు తీయగా, అర్ష్‌దీప్ సింగ్ 1 వికెట్ తీశాడు.
అంతకు ముందు టాస్ గెలిచిన సౌతాఫ్రికా టీమిండియాను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. సంజూ శాంసన్ సెంచరీతో చేలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 8 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. సంజు 10 సిక్స్‌లు, 7 ఫోర్లతో 107 పరుగులు చేశాడు. తిలక్ వర్మ 33 పరుగులు చేశాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 21 పరుగులు చేశాడు. రింకూ సింగ్ 11 పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికా తరఫున గెరాల్డ్ కోయెట్జీ 3 వికెట్లు పడగొట్టాడు.
దక్షిణాఫ్రికా ప్లేయింగ్ ఎలెవన్
ఐడాన్ మార్క్రామ్ (కెప్టెన్), ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిక్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, పాట్రిక్ క్రూగర్, మార్కో జాన్సెన్, ఆండిల్ సిమెలన్, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్, న్కాబయోమ్జీ పీటర్.
టీమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవన్
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్.