యువి బయోపిక్ వచ్చేది అప్పుడే…

T Series Producing Yuvraj Biopic,Cricket News,Movie News,Team India,Yuvraj Singh,Yuvi,Mango News,Mango News Telugu,T Series,Yuvraj Singh News,Yuvraj Singh Latest News,Yuvraj Singh Movie,Yuvraj Singh Biopic,Yuvraj Singh Biopic Movie,Yuvraj Singh Biopic News,Yuvraj Singh Biopic Updates,Yuvraj Singh Biographical Movie,Biopic On Indian Cricketer Yuvraj Singh Announced By T Series,Biopic On Yuvraj Singh,Indian Cricketer Yuvraj Singh,Cricketer Yuvraj Singh,Yuvraj Singh Biopic Announced,Cricketer Yuvraj Singh's Biopic Announced,Yuvraj Singh Biopic Set At T-Series,Bhushan Kumar,Yuvraj Singh Biopic Movie Announced,Movie News,Cricket,Yuvraj Singh Biopic Movie News

ఇండియాలో క్రికెట్ మతం అయితే అందులో దేవుడు సచిన్. ఇందులో ఎవరికి ఎలాంటి సందేహం లేదు. కాని సచిన్ కంటే ముందు సచిన్ తరువాత ఎందరో లెజెండరీ క్రికెటర్లు టీమిండియాకు ఆడారు. కాని ఎంత మంది ఉన్న అందులో అందరి మనసుని గెలుచుకున్న ఆటగాడు మాత్రం యువరాజ్ సింగ్. టీమిండియాకు ఒంటి చేత్తో రెండు ప్రపంచకప్ లు అందించిన చాంపియన్ యువరాజ్. అంతే కాదు భారతీయ క్రికెట్ చరిత్రలో యువరాజ్ సింగ్ ఒక సంచలనం. ఒక్క ఓవర్‌లో ఆరు సిక్సర్లు ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్ యువరాజ్ సింగ్! ఇప్పుడు ఆయన జీవితం మీద సినిమా తెరకెక్కుతోంది. ఈ రోజు ఆ సినిమాను అనౌన్స్ చేశారు.

యువరాజ్ అంటే క్రికెట్ ఒకటే కాదు… జీవిత పోరాటం! ఆయనకు 2011లో క్యాన్సర్ ఉందని తెలిసింది.‌ దానిపై పోరాటం చేయడమే కాదు, క్యాన్సర్ నుంచి కోలుకొని మళ్ళీ మైదానంలో అడుగుపెట్టాడు. ఐపీఎల్ లో కూడా సత్తా చాటాడు‌. 2019లో ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. బ్రిటిష్ మోడల్, బాలీవుడ్ సినిమాల్లో నటించిన, ‘బిగ్ బాస్ 7’లో పార్టిసిపేట్ చేసిన హాజల్ కీచ్, యువరాజ్ 2016లో పెళ్లి చేసుకున్నారు. యువరాజ్ సింగ్ బయోపిక్ టైటిల్ ఇంకా వెల్లడించలేదు. కానీ, అతని జీవితం మీద సినిమా తీస్తున్నట్లు ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్, మరొక నిర్మాత రవి భాగ్ చందక వెల్లడించారు. యువి బయోపిక్ లో హీరో ఎవరు? అయితే ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారు? అనేది ఇంకా వెల్లడించలేదు.

మాస్టర్ బ్లాస్టర్, ఇండియన్ క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ జీవితం మీద తెరకెక్కించిన ‘సచిన్: ఏ బిలియన్ డ్రీమ్స్’ డాక్యుమెంటరీ నిర్మాణంలో రవి భాగస్వామిగా ఉన్నారు. ఇప్పుడు మరొక క్రికెటర్ యువరాజ్ సింగ్ జీవితాన్ని తెరపైకి తీసుకు రావడంలో కృషి చేస్తున్నారు. పదమూడేళ్ల వయసులో పంజాబ్ అండర్ 16 క్రికెట్ జట్టకు యువరాజ్ సింగ్ ఎంపిక అయ్యారు. ఆ తర్వాత 2000 సంవత్సరంలో అండర్ 19 వరల్డ్ కప్ కూడా ఆడారు. అందులో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు యువరాజ్ అందుకున్నారు. ఆ తర్వాత టీమ్ ఇండియా జట్టుకు ఎంపిక అయ్యారు. ఇక 2007 టీ 20 వరల్డ్ కప్ విజయంలో యువరాజ్ కీలక పాత్ర పోషించారు. ఒకే ఓవర్లో ఆరు సిక్సులు బాది ఎప్పటికీ క్రికెట్ అభిమానులు యువీ గుర్తుండిపోతాడు. కాగా యువి బయోపిక్ వచ్చే సంవత్సరం క్రిస్ మస్ వరకు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది.