17 ఏళ్ల తర్వాత టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలుపొందిన విషయం తెలిసిందే. ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఆటగాళ్ల అద్భుతంగా రాణించి కప్‌ను సొంతం చేసుకున్నారు. కప్ సాధించిన తర్వాత తొలిసారి ఆటగాళ్లు స్వదేశంలో ఆడుగుపెట్టారు. గురువారం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు. వారికి ఆహ్వానం పలికేందుకు పెద్ద ఎత్తున అభిమానులు ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ప్లేయర్లు, అభిమానులతో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ కిక్కిరిసిపోయింది. ఆ తర్వాత టీమిండియా ప్లేయర్లు ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీలోని ప్రధాని మోడీ నివాసానికి చేరుకున్నారు. అక్కడ మోడీతో సమావేశమయ్యారు. దాదాపు గంటన్నరపాటు సాగిన ఈ సమావేశంలో.. మోడీ ప్రతీ క్రికెటర్‌ను ఆప్యాయంగా పలకరించి అభినంనదనలు తెలియజేశారు. అలాగే ప్లేయర్లతో కలిసి మోడీ అల్పాహారం చేశారు.
సమావేశం అనంతరం బీసీసీఐ తరుపున మోడీ సత్కరించారు. ఈ సందర్భంగా నమో అని రాసి ఉన్న టీమిండియా జెర్సీని మోడీకి అందజేశారు. టీమిండియా ప్లేయర్లను కలిసిన అనంతరం ప్రధాని మోడీ ఎక్స్ ప్లాట్ ఫామ్‌లో పోస్ట్ పెట్టారు. ఛాంపియన్‌లతో గొప్ప సమావేశం జరిగింది. ప్రపంచకప్ విజేత జట్టుకు అపూర్వ స్వాగతం లభించిందని పోస్టులో మోడీ పేర్కొన్నారు. అటు భారత ఆటగాళ్లు మోడీని కలిసిన విషయాన్ని తెలియజేస్తూ బీసీసీఐ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ‘టీ20 వరల్డ్ కప్‌లో విజయం సాధించిన టీమిండియా ఈరోజు ప్రధాని మోడీని ఆయన అధికారిక నివాసంలో కలిసింది. మీ స్పూర్తిదాయకమైన మాటలు.. మీరు ఇచ్చిన మద్ధతుకు మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. జై హింద్‘ అంటూ బీసీసీఐ పోస్ట్ పెట్టింది.
ఇకపోతే వెస్టిండీస్‌లోని బ్రిడ్జిటౌన్‌లో ఆదివారం టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. భారత్, దక్షిణాఫ్రికా జట్లు ఫైనల్లో తలపడ్డాయి. సస్పెన్స్ థ్రిల్లర్ తలపించిన ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై భారత్ 7 పరుగుల తేడాతో గెలుపొందింది. 17 ఏళ్ల తర్వాత ఐసీసీ టీ20 వరల్డ్ కప్-2024ను సగర్వంగా భారత్ ఒడిసిపట్టింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 176 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్లకు 169 పరుగులు చేసి ఓటమి పాలయింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY