చెన్నై టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో భారత్ తడబడుతోంది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు 3 వికెట్లు కోల్పోయి ఆరంభంలోనే షాక్‌కు గురైంది. కొద్దిరోజుల క్రితమే పాక్‌ను వారి సొంతగడ్డపైనే చిత్తుచేసి చరిత్ర సృష్టించి జోరుమీదున్న బంగ్లాదేశ్.. అదే ఉత్సాహంతో భారత్‌నూ దెబ్బకొట్టానలని చూస్తోంది.మేఘావృతమైన పరిస్థితుల్లో కొత్త బంతి ఎక్కువగా స్వింగ్ అవుతుండటంతో టీమ్ ఇండియా బ్యాట్స్ మెన్ జాగ్రత్తగా ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ రెండు సార్లు ప్రమాదంలో పడినప్పటికీ అదృష్టవశాత్తూ బయటపడ్డారు.
బంగ్లాదేశ్ యువ పేసర్ హసన్ బౌలింగ్ టీమిండియా టాప్ ఆర్డర్ తడబడుతోంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 6 పరుగులు చేసి వికెట్ సమర్పించుకున్నాడు. పేసర్ హసన్ మహమూద్ బౌలింగ్ రెండు పరుగుల వద్ద రోహిత్ ఎల్బీ గా ఔట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.. అయితే అదే హసన్ బౌలింగ్ లో భారత జట్టు 14 పరుగులు ఉండగా రోహత్ ఔటయ్యాడు. దీంతో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. మూడో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన శుభ్‌మన్ గిల్ 7 బంతుల్లో సున్నా స్కోరుతో పెవిలియన్ చేరాడు. లెగ్ స్టంప్ దాటి బంతిని ఫ్లిక్ చేసేందుకు ప్రయత్నించి వికెట్ కీపర్ లిటన్ దాస్ చేతికి చిక్కాడు. హసన్ మహమూద్ 2వ వికెట్ తీసి భారత్‌కు ఆరంభంలోనే షాక్ ఇచ్చాడు.
దిగ్గజ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ కూడా నిరాశపరిచాడు. ఫాస్ట్ బౌలర్ హసన్ మహమూద్ వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి కేవలం 6 పరుగుల వద్ద నిష్క్రమించాడు. విరాట్ ఔట్ తరువాత క్రీజులోకి వచ్చిన పంత్ నిలకడగా ఆడుతున్నాడు. డిసెంబర్ 2022లో కారు ప్రమాదం కారణంగా క్రికెట్‌కు దూరంగా ఉన్న వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ ఇప్పుడు టెస్ట్ క్రికెట్‌కు తిరిగి వచ్చాడు. మరో వైపు యశస్వి జైస్వాల్ నిలకడగా ఆడుతున్నాడు. జట్టు స్కోరు మూడు వికెట్ల నష్టానికి 57 పరుగులు.