రేపటి నుంచే భారత్, న్యూజిలాండ్ మధ్య 3 వన్డేల సిరీస్: గాయంతో శ్రేయాస్ అయ్యర్ దూరం, జట్టులోకి రజత్ పాటిదార్‌

New Zealand’s Tour of India: Shreyas Iyer Ruled out of 3-match ODI Series Names Rajat Patidar as Replacement,New Zealand’s Tour of India,Shreyas Iyer Ruled out of 3-match ODI Series, Names Rajat Patidar as Replacement,Mango News,Mango News Telugu,India Vs New Zealand Tickets,India Vs New Zealand World Cup 2023,India Vs New Zealand 2023 T20,India Vs New Zealand Schedule,India Vs New Zealand T20,India Vs New Zealand Test,India Vs New Zealand Hyderabad Tickets,India Vs New Zealand Upcoming Match,India Vs New Zealand Live,India Vs New Zealand Live Score,India Vs New Zealand 2023,India Vs New Zealand Wtc Final,India Vs New Zealand Live Score 2023,India Vs New Zealand 2Nd Test 2023,India Vs New Zealand Test 2023,India Vs New Zealand Highlights,India A Vs New Zealand A Live Score Today,India Legends Vs New Zealand Legends,Indian Vs New Zealand,India A Vs New Zealand A Today Match

న్యూజిలాండ్ క్రికెట్ జట్టు భారత్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జనవరి 18, 21, 24 తేదీల్లో మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్, జనవరి 27, 29, ఫిబ్రవరి 1వ తేదీల్లో మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ జరగనుంది. రేపు (జనవరి 18, బుధవారం) హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా మధ్యాహ్నం 1.30 గంటల నుంచి భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య తోలి వన్డే జరగనుంది.

న్యూజిలాండ్ తో జరిగే వన్డే సిరీస్ కోసం ఆల్ ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ ఇప్పటికే భారత్ జట్టును ఎంపిక చేయగా, తాజాగా భారత్ వన్డే జట్టులో చోటుచేసుకున్న ఓ మార్పుపై బీసీసీఐ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. న్యూజిలాండ్ తో జరగనున్న 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కి గాయం కారణంగా టీమిండియా బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ దూరమయ్యాడు. ఈ క్రమంలో శ్రేయాస్ అయ్యర్ స్థానంలో వన్డే జట్టులోకి రజత్ పాటిదార్‌ ను ఆల్-ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసినట్టు బీసీసీఐ తెలిపింది.

“వెన్ను గాయం కారణంగా న్యూజిలాండ్‌ తో జరగనున్న 3 వన్డేల సిరీస్‌కు టీమిండియా బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ దూరమయ్యాడు. తదుపరి అంచనా మరియు నిర్వహణ కోసం అతను బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)కి వెళ్తాడు. ఆల్-ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ శ్రేయాస్ అయ్యర్ స్థానంలో రజత్ పాటిదార్‌ను ఎంపిక చేసింది” అని బీసీసీఐ తెలిపింది.

న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రజత్ పాటిదార్, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్. షమీ, మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్.

న్యూజిలాండ్‌ తో టీ20 సిరీస్ కు భారత్ జట్టు: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, శివమ్ మావి, పృథ్వీ షా, ముఖేష్ కుమార్.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 2 =