పూణెలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న 2వ టెస్టు మ్యాచ్‌లో 2వ రోజు అత్యంత పేలవమైన షాట్ తో ఔటయిన భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీపై మాజీ బ్యాట్స్‌మెన్ మరియు వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ విమర్శలు గుప్పించారు. బెంగళూరులో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో ఘోరంగా ఓడిపోయిన తరువాత కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లిలు పూణె టెస్టు మ్యాచ్‌లో బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేస్తారని అందరూ ఊహించారు. అయితే అందరి లెక్కలు తప్పాయి.
రోహిత్ – విరాట్ పేలవ ప్రదర్శన
ఖాతా తెరవకముందే రోహిత్ శర్మ పెవిలియన్ చేరగా, ఖాతా తెరవగానే విరాట్ కోహ్లీ ఔటయ్యాడు. జట్టు 50 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన సమయంలో విరాట్ కోహ్లీ క్రీజీలోకి వచ్చాడు. దీంతో భారత క్రికెట్ ప్రేమికులు అతడి నుంచి భారీ ఇన్నింగ్స్‌ని ఆశించార. కానీ 8 బంతులు ఎదుర్కొన్న అతను 1 పరుగు చేసి సాంట్నర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అది కూడా ఫుల్ టాస్ బాల్ కి.. ఇప్పుడు దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మంజ్రేకర్ ఎక్స్ పోస్ట్
సంజయ్ మంజ్రేకర్ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఎక్స్‌లో విరాట్ కోహ్లీని ఉద్దేశిస్తూ పోస్టు పెట్టాడు. విరాట్ తన జీవితంలో ఆడిన చెత్త షాట్ ఇదేనని అన్నాడు. ఇలా వికెట్‌ను సమర్పించుకోవడం బాధాకరం. ఎందుకంటే జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు, వికెట్ల పతనాన్ని అడ్డుకోవడానికి సీనియర్ బ్యాటర్లు తమ అనుభవాన్ని ఉపయోగించి చాలా బాధ్యతయూతమైన షాట్లు ఆడిల్సి ఉంటుంది. కానీ కోహ్లీ మాత్రం అత్యంత చెత్త షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. విరాట్ కోహ్లి ఔట్ అయిన వెంటనే వీకేసీ స్టేడియంలో నిశ్శబ్దం నెలకొంది.
ఇక విరాట్ కోహ్లీ పదే పదే స్పిన్ బౌలింగ్ లో ఔట్ అవుతుండటంపై మాజీ కోచ్ అనిల్ కుంబ్లే స్పిందించాడు. దేశవాళీ క్రికెట్‌లో విరాట్ పెద్దగా ఆడకపోవడమే ఈ తరహా ప్రదర్శనకు కారణమని పేర్కొన్నాడు. కాబట్టి విరాట్ కోహ్లీ ఇరానీ కప్ మరియు ఇతర దేశవాళీ క్రికెట్ ఈవెంట్లలో ఆడడం ద్వారా తిరిగి లయను అందిబుచ్చుకునే అవకాశముందని.. అంతర్జాతీయ టెస్టు మ్యాచ్‌లకు సన్నద్ధమయ్యేందుకు ఇది దోహదపడుతుందని తెలిపాడు.
పుణె పిచ్ స్పిన్ కు సహకరిస్తుండటంతో భారత్ ముగ్గురు స్పిన్నర్లను రంగంలోకి దించింది. దాదాపు మూడేళ్ల తర్వాత టెస్టు మ్యాచ్ ఆడిన వాషింగ్టన్ సుందర్ 7 వికెట్లు పడగొట్టి న్యూజిలాండ్‌ను 259 పరుగుల స్వల్ప స్కోరుకు పరిమితం చేశాడు. దీనికి సమాధానంగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ కేవలం 156 పరుగులకు ఆలౌటైంది. స్పిన్నర్లు సాంట్నర్, ఫిలిప్స్ భారత్ బ్యాటింగ్ వెన్నెముకను విరిచారు. రెండో ఇన్నింగ్స్‌లో 103 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ 140 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. కానీ ఆ జట్టు ఆధిక్యం మాత్రం 300 ల పరుగులకు చేరకుంది.