బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఆడేందుకు రోహిత్ శర్మ నేతృత్వంలోని ఒక జట్టు ఆస్ట్రేలియా వెళ్తుండగా, సూర్య కుమార్ యాదవ్ నేతృత్వంలోని మరో జట్టు టీ20 సిరీస్ ఆడేందుకు దక్షిణాఫ్రికాలో పర్యటిస్తోంది. నేడు తొలి టీ20 ప్రారంభం ఆడనున్నాయి దక్షిణాఫ్రికా, టీమిండియా జట్లు.
అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. టీ20 స్పెషలిస్ట్ అయిన సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాత్రమే ఆస్ట్రేలియా వెళ్తున్నాడు. ఆస్ట్రేలియా A జట్టుతో భారత్ A జట్టు ఆడుతున్న అనధికారిక టెస్టుకు అతను కెప్టెన్‌గా ఉన్నాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌కు అతడిని ఎందుకు ఎంపిక చేయలేదనేది అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ని ఇదే విషయమై అడిగితే ఆశ్చర్యకరమైన సమాధానం చెప్పాడు.
దక్షిణాఫ్రికాతో టీ20 మ్యాచ్‌కు ముందు భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రుతురాజ్ గైక్వాడ్ అద్భుతమైన ఆటగాడు. రుతురాజ్ చాల నిలకడైన ఆటగాడు.. కాని అతడి కంటే ముందు మన దగ్గర చాలా మంది ఆటగాళ్లు ఉన్నారు. అందుకే ఒక్కొక్కరికి ఒక్కోసారి అవకాశం ఇచ్చే విధానాన్ని టీమ్ మేనేజ్‌మెంట్ అనుసరిస్తోందని చెప్పుకొచ్చాడు.
అతను ఇప్పటికీ యువ ఆటగాడే బాగా ఆడుతున్నాడు. ఉస్కా భీ నంబర్ ఆయేగా. ఉస్కా భీ టైమ్ ఆయేగా (అతని నంబర్ వస్తుందని నేను అనుకుంటున్నాను. అతనికి కూడా సమయం వస్తుంది.) అని చెప్పుకొచ్చాడు.
ఫామ్‌లో ఉన్న రుతురాజ్
ఈ ఏడాది జింబాబ్వేతో టీ20 సిరీస్‌లో గైక్వాడ్ అద్భుత ప్రదర్శన చేశాడు. అతను 158.33 స్ట్రైక్ రేట్‌తో 66.540 సగటుతో 133 పరుగులు చేసి రాణించాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కు కెప్టెన్‌గా ఉన్నాడు. అదేవిధంగా దులీప్ ట్రోఫీ టోర్నీలో భారత్ సి జట్టుకు నాయకత్వం వహించాడు. ఇరానీ ట్రోఫీ టోర్నీలో భారత జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న అనధికారిక టెస్టులో భారత్ ఎ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు.
దేశవాళీ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లలో రాణిస్తున్నప్పటికీ అతనికి జాతీయ జట్టులో చోటు దక్కకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. సూర్య కుమార్ యాదవ్ ఇచ్చిన సమాధానం మరింత వివాదం సృష్టిస్తోంది. దక్షిణాఫ్రికాలో భారత్ 4 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది, ఇందులో మొదటి మ్యాచ్ ఈ రోజు డర్బన్‌లో జరుగుతుంది. దక్షిణాఫ్రికాకు ఐడెన్ ఐడెన్ మార్క్రామ్ నాయకత్వం వహించనున్నాడు.