బరువు పెరగడానికి వినేష్ చెప్పిన కారణాలు ఇవే…

రజత పతక కోసం కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ (CAS) లో రెజ్లర్ వినేష్ ఫోగట్ వేసిన పిటిషన్‌పై తీర్పు కోసం యావత్ భారతదేశం ఎదురుచూస్తోంది. మహిళల ఫ్రీస్టైల్ 50కే రెజ్లింగ్ బౌట్‌లో ఫైనల్‌కు 50 కేజీల కంటే ఎక్కువ బరువు ఉండటంతో వినేష్ పై అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. ఫైనల్‌కు చేరిన వెంటనే వినేష్ ఫోగట్ భారత్‌కు పతకం ఖాయమైంది. అది స్వర్ణం లేదా రజతం కావొచ్చు భార‌త్ అభిమానులు సైతం భావించారు. కానీ ఫైనల్ రోజున వినేష్ 100 గ్రాముల‌ అధిక బరువు కారణంగా అనర్హులుగా ప్ర‌క‌టించ‌డంతో వినేష్ రేసు నుండి నిష్క్రమించింది. అయితే వినేష్ ఇంకా పట్టు వదలకుండా కనీసం తనకు జాయింట్ సిల్వర్ మెడల్ అయినా ఇప్పించాలని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ (సీఏఎస్)లో అప్పీల్ చేసింది.

ఈ వ్యవహారంపై సీఏఎస్ కోర్టులో వాదోపవాదనలు నడుస్తున్నాయి. ఈ ఒలింపిక్స్‌లో చాలా టైట్ షెడ్యూల్‌ని ఎదుర్కోవలసి వచ్చిందని చెప్పింది వినేష్ కోర్టుకు తెలిపారు. ఇది కాకుండా ఒలంపిక్స్ విలేజ్ నుంచి రెజ్లింగ్ అరేనాకు చేరుకోవడానికి చాలా సమయం పట్టింద‌ని.. దీని కారణంగా నిర్ణీత 50 కిలోల బరువును తగ్గించుకునేందుకు సమయం దొరకలేద‌ని వినేష్ పేర్కొన్న‌ట్లు తెలుస్తోంది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లోని ఒక నివేదిక ప్రకారం , కుస్తీ పోటీలకు వేదిక అయిన చాంప్ డి మార్స్ ఎరీనా మరియు అథ్లెట్స్ విలేజ్ మధ్య ఉన్న దూరాన్ని ఫోగాట్ తరపు న్యాయవాది హైలెట్ చేసి చూపారు. షెడ్యూల్ చేసిన నిర్ణీత సమయంలో బరువులో తగ్గించుక చేయడంలో ఆమె విఫలమయ్యారని పేర్కొన్నారు. టైట్ షెడ్యూల్ వలనే వినేష్ బరువు తగ్గించుకోలేకపోయారని. దీంతో పోటీలో పాల్గొనలేకపోయారని పేర్కొన్నారు.

100 గ్రాముల బరువు చాలా తక్కువ అని వినేష్ ఫోగట్ తరపు న్యాయవాదులు తెలిపారు. ఇది అథ్లెట్ గరిష్ట బరువు కంటే 0.1 లేదా 0.2 శాతం మాత్రమే ఎక్కువ. ఆ మాత్రం బరువు పెరగడానికి అనేక కారణాలుంటాయని పేర్కొన్నారు. అథ్లెట్లు నిరంతర పోటీలో పాల్గొనడం, వ్యాయామాల వలన కండరాలు కూడా పెరుగుతాయని. అలాంటప్పుడు ఆటగాళ్లకు సరైన అహారం కూడా అందించవలసి వస్తుందని… ఆ ఆహారాలే బరువును పెంచుతాయని వినేష్ తరఫున న్యాయవాది పేర్కొన్నారు. సీనియర్ న్యాయవాది హరీష్ విదుష్పత్ సింఘానియా మాట్లాడుతూ.. అనుకూల వినేష్ కు అనుకూలాంగా నిర్ణయం వెలువడుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.