భారత్ 273/3 – మయాంక్ అగర్వాల్ సెంచరీ

2019 Latest Sport News, 2019 Latest Sport News And Headlines, India vs South Africa 2nd Test, India vs South Africa 2nd Test Match, India vs South Africa 2nd Test Mayank Agarwal, India vs South Africa 2nd Test Mayank Agarwal Registers Another Century, India vs South Africa Match, latest sports news, latest sports news 2019, Mango News Telugu, Mayank Agarwal Registers Another Century, sports news

ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ లో భాగంగా దక్షిణాఫ్రికా జట్టుతో పుణెలోని ఎంసీఏ వేదికగా మొదలైన రెండో టెస్టులో భారత జట్టు పట్టు బిగిస్తుంది. తోలి టెస్టులో డబుల్ సెంచరీ సాధించిన ఓపెనర్ మయాంక్ అగర్వాల్ మరోసారి సెంచరీ (108)చేసి ఆకట్టుకున్నాడు. చటేశ్వర్ పుజారా (58) పరుగులు చేయగా, కెప్టెన్ విరాట్ కోహ్లీ 63 పరుగులతో క్రీజులో ఉన్నాడు. తొలిరోజు ఆట ముగిసే సరికి భారత జట్టు, తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల కోల్పోయి 273 పరుగులు చేసింది.

మొదటగా టాస్ గెలిచిన కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తోలి టెస్టులో రెండు ఇన్నింగ్స్ ల లోనూ సెంచరీలు చేసిన ఓపెనర్ రోహిత్ శర్మ (14) పరుగులకే అవుట్ అయ్యాడు. బౌలర్ కసిగో రబడా మంచి లైన్ అండ్ లెంగ్త్‌తో వేసిన బంతి ద్వారా ఈ వికెట్ దక్కించుకున్నాడు. తరువాత చటేశ్వర్ పుజారాతో కలిసి మయాంక్ అగర్వాల్ దక్షిణాఫ్రికా బౌలర్లను దీటుగా ఎదురుకున్నాడు. లంచ్ తరువాత 77/1 బ్యాటింగ్ ప్రారంభించిన భారతజట్టు టీ విరామ సమయానికి 168/2 పరుగులు చేసింది. చటేశ్వర్ పుజారా కూడ రబడా బౌలింగ్ లోనే అవుట్ అయ్యాడు. ఉదయం నుంచి అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ వస్తున్నా మయాంక్ చివరి సెషన్ లో సెంచరీ(108) సాధించాడు. సెంచరీ పూర్తీ చేసిన కొద్దిసేపటికే రబడా బౌలింగ్ లో స్లిప్స్ లో డుప్లెసిస్‌ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. తోలి రోజు ఆట ముగిసే సమయానికి కెప్టెన్ విరాట్ కోహ్లీ 63 పరుగులు , అజింక్య రహానె 18 పరుగులతో క్రీజులో ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − 7 =