భారత సంతతికి చెందిన అమ్మాయిని పెళ్లాడిన, ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ గ్లెన్ మాక్స్‌వెల్

Australian Star Cricketer Glenn Maxwell Got Married To Indian-Origin Vini Raman Today, Cricketer Glenn Maxwell Got Married To Indian-Origin Vini Raman Today, Glenn Maxwell Got Married To Indian-Origin Vini Raman, Australian Star Cricketer Glenn Maxwell, Indian-Origin Vini Raman, Cricketer Glenn Maxwell, Australian Star Cricketer, Glenn Maxwell, Australian Star Cricketer Glenn Maxwell Got Married, Glenn Maxwell Got Married To Vini Raman, Glenn Maxwell Marriage, Glenn Maxwell Marriage Latest News, Glenn Maxwell Marriage Latest Updates, Star Cricketer, Mango News, Mango News Telugu,

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్, ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ ఈరోజు భారతీయ సంతతికి చెందిన యువతి వినీ రామన్‌ను వివాహం చేసుకున్నారు. గత కొంతకాలంగా భారతీయ సంతతికి చెందిన వినీ రామన్‌తో మాక్స్‌వెల్ ప్రేమలో ఉన్నాడు. అయితే ఈ మధ్య తమిళంలో వీరి పెళ్లి కార్డు లీక్ కావడంతో గత కొన్ని రోజులుగా వీరి పెళ్లి గురించిన వార్తలు వినిపిస్తున్నాయి. తమిళ కుటుంబానికి చెందిన వినీ రామన్‌ ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఫార్మసిస్ట్ గా పనిచేస్తున్నారు. కాగా, వినీ రామన్, మాక్స్‌వెల్ ఫిబ్రవరి 2020లో నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే మాక్స్‌వెల్ పెళ్లి చేసుకున్న వార్త గత నెలలో వారి వెడ్డింగ్ కార్డు ఇంటర్నెట్‌లో వైరల్ అయినప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది. పూర్తిగా తమిళంలో రాసిన ఈ ఆహ్వాన పత్రికకు నెటిజన్లు ఫిదా అయ్యారు. దీనిని నిజం చేస్తూ ఈరోజు వారిద్దరూ వివాహబంధంలోకి అడుగుపెట్టారు.

కాగా మాక్స్‌వెల్ ఐపీల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరపున ఆడుతుండటం క్రికెట్ అభిమానులకు తెలిసిన విషయమే. అయితే ఈ విషయాన్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా తన అధికారిక ట్విట్టర్ లో తెలిపింది. “ఈ వార్త పట్ల RCB కుటుంబం చాలా సంతోషంగా ఉంది. వారి జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది. మీ ఇద్దరికీ సంతోషం మరియు శాంతి కలగాలని కోరుకుంటున్నాం”  అని మాక్స్‌వెల్ ని ఉద్దేశించి ఒక పోస్ట్ పెట్టింది. మరోవైపు ఈ వివాహ వార్త తెలిసిన ఆస్ట్రేలియన్ కెప్టెన్ ఆరోన్ ఫించ్, భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ వంటి పలువురు క్రికెటర్లు నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 1 =