శ్రీలంకలో జరగనున్న వన్డే సిరీస్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇవ్వనున్నారు. ఈ టూర్‌లో భారత జట్టుకు స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా లేదా వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ నాయకత్వం వహించే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. జూలై చివరలో, భారత జట్టు 3 మ్యాచ్‌ల వన్డే క్రికెట్ సిరీస్ ఆడేందుకు శ్రీలంకకు వెళ్లనుంది. ఇక ICC ఛాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్‌కు 2025 ఫిబ్రవరి, మార్చిలో పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ టోర్నమెంట్ క్రికెట్ ప్రపంచంలోని మినీ వరల్డ్ కప్‌గా అందరూ భావిస్తారు. అందుకే శ్రీలంక తో జరిగే సిరీస్ ద్వారా ఈ టోర్నమెంట్ కోసం టీమ్ ఇండియా తన వేటను ప్రారంభించనుంది. ఇక తదుపరి ఛాంపియన్స్ టోర్నమెంట్‌లో భారత జట్టుకు రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తాడని బీసీసీఐ సెక్రటరీ జే షా ఇప్పటికే చెప్పారు.
అయితే టీ20 ప్రపంచకప్ గెలిచిన సీనియర్ ఆటగాళ్లు శ్రీలంకతో సిరీస్ నుంచి విశ్రాంతి కావాలనే ఏకైక కారణం తో జట్టుకు దూరంగా ఉన్నారు. ఐపీఎల్ 2024 టోర్నీ, టీ20 ప్రపంచ కప్ టోర్నీలో పాల్గొనే సీనియర్ ఆటగాళ్లు అలసిపోయారని బీసీసీఐ సెలక్షన్ కమిటీ గుర్తించింది. 37 ఏళ్ల ఓపెనర్ రోహిత్ శర్మ మరియు 36 ఏళ్ల బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీకి శ్రీలంక పర్యటనకు ఎంపిక చేయలేదు. గత ఆరు నెలలుగా రోహిత్ శర్మ ఎలాంటి విరామం తీసుకోలేదు. గత డిసెంబరులో దక్షిణాఫ్రికాపై, జనవరిలో ఆఫ్ఘనిస్థాన్‌పై, ఆ తర్వాత ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో ఆడి ఐపీఎల్. ఆ తర్వాత టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టుకు నాయకత్వం వహించాడు. కాబట్టి రోహిత్‌కి ఈ విశ్రాంతి అవసరం. కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యాలకు గతంలో కొన్ని సార్లు భారత జట్టును నడిపిన అనుభవం ఉంది. దీంతో లంకతో వన్డే సిరీస్‌లో టీమిండియా కెప్టెన్సీ కోసం కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యాల మధ్య పోటీ నెలకొంది.
ODI క్రికెట్ కి వచ్చే సరికి రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ నే తమ మొదటి ఎంపిక అని… 2025 ఛాంపియన్స్ ట్రోఫీ పర్యటనకు ముందు, టిమిండియా ఇంగ్లాండ్‌తో సిరీస్ ఆడుతుంది. ఆ సిరీస్ లో ఈ ఇద్దరు ఆటగాళ్లు ఆడటం తప్పనిసరి. బంగ్లాదేశ్‌తో 2 టెస్ట్ మ్యాచ్‌లు ఆడనున్న టీమిండియా 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో న్యూజిలాండ్‌తో తలపడనుంది. తర్వాత అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియాకు వెళ్లనుంది టీమిండియా. ఇక రాబోయే రోజుల్లో ఈ ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు ఎక్కువగా టెస్ట్ క్రికెట్‌పై దృష్టి పెట్టనున్నారు. ఈ యేడాది సెప్టెంబర్ నుండి వచ్చే జనవరి వరకు భారత జట్టు 10 టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. దీంతో రానున్న టెస్ట్ ఛాంపియన్షిప్ గెలవడం వీరి లక్ష్యం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY