ఐపీఎల్-2023 మినీ వేలం: 10 ప్రాంఛైజీలు కొనుగోలు చేసిన క్రికెటర్ల జాబితా ఇదే…

IPL 2023 Auction, IPL 2023 Full List of Players, IPL Players Bought by the 10 Franchises, Mango News, Mango News Telugu, ipl 2023 auction players list, ipl 2023 auction players list all team, ipl 2023 auction update, IPL 2023 Auction Updates, IPL Auction 2023 Highlights, IPL Auction 2023 Updates on Players Sold, Indian Premier League 2023 Auction

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్)-2023 మినీ వేలం డిసెంబర్ 23, శుక్రవారం నాడు కొచ్చిలో జరిగింది. ఈ వేలంలో మొత్తం 405 మంది ఆటగాళ్లు ఉన్నారు. కాగా 10 ఫ్రాంచైజీలు కలిపి 80 మంది క్రికెటర్లను కొనుగోలు చేశాయి. వీరిలో 51 మంది భారతీయ క్రికెటర్లు కాగా, 29 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. ఐపీఎల్ 2023 వేలంలో ఆటగాళ్ల కోసం 10 ఫ్రాంచైజీలు కలిసి రూ.167 కోట్లు ఖర్చు చేశాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈ వేలంలో అందరికంటే ఎక్కువుగా 13 మందిని కొనుగోలు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్‌ అత్యల్పంగా ఐదుగురిని కొనుగోలు చేసింది.

అత్యధిక ధర పలికిన ఐదుగురు ఆటగాళ్లు:

కాగా ఈ ఐపీఎల్ వేలంలో ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ సామ్ కుర్రాన్ రూ.18.50 కోట్లు దక్కించుకుని చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు ఐపీఎల్ వేలం చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా సామ్ కుర్రాన్ నిలిచాడు. సామ్ కుర్రాన్ కనీస ధర రూ.2 కోట్లు కాగా రూ.18.50 కోట్లుకు పంజాబ్ కింగ్స్‌ జట్టు దక్కించుకుంది. అలాగే ఆస్ట్రేలియా ఆటగాడు కామెరాన్ గ్రీన్ ను ముంబయి ఇండియన్స్ రూ.17.50 కోట్లతో, ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ బెన్ స్టోక్స్ ను చెన్నై సూపర్ కింగ్స్ రూ.16.25 కోట్లకు, వెస్టిండీస్ ఆటగాడు నికోలస్ పురాన్ ను రూ.16.00 కోట్లకు లక్నో సూపర్‌ జెయింట్స్, ఇంగ్లాండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్ ను రూ.13.25 కోట్లకు సన్ రైజర్స్ హైదరాబాద్ దక్కించుకున్నాయి.

ఐపీఎల్-2023 వేలంలో 10 ఫ్రాంచైజీలు కొనుగోలు చేసిన ఆటగాళ్ళ వివరాలు:

చెన్నె సూపర్‌ కింగ్స్‌:

 1. బెన్ స్టోక్స్ – ఆల్ రౌండర్ – రూ.16.25 కోట్లు
 2. కైల్ జేమీసన్ – బౌలర్ – రూ.1 కోటి
 3. నిశాంత్ సింధు – ఆల్ రౌండర్ రూ.60 లక్షలు
 4. అజింక్య రహానే – బ్యాటర్ – రూ.50 లక్షలు
 5. భగత్ వర్మ – ఆల్ రౌండర్ – రూ.20 లక్షలు
 6. అజయ్ మండల్ – ఆల్ రౌండర్ – రూ.20 లక్షలు
 7. షేక్ రషీద్ – బ్యాటర్ – రూ.20 లక్షలు

ఢిల్లీ క్యాపిటల్స్‌:

 1. ముఖేష్ కుమార్ – బౌలర్ – రూ.5.50 కోట్లు
 2. రిలీ రోసౌ – బ్యాటర్ – రూ.4.60 కోట్లు
 3. మనీష్ పాండే – బ్యాటర్ – రూ.2.40 కోట్లు
 4. ఫిల్ సాల్ట్ – వికెట్ కీపర్ – రూ.2 కోట్లు
 5. ఇషాంత్ శర్మ బౌలర్ – రూ.50 లక్షలు

గుజరాత్ టైటాన్స్:

 1. శివమ్ మావి – బౌలర్ – రూ.6 కోట్లు
 2. జాషువా లిటిల్ – బౌలర్ – రూ.4.40 కోట్లు
 3. కేన్ విలియమ్సన్ – బ్యాటర్ – రూ.2 కోట్లు
 4. కె.ఎస్. భారత్ – వికెట్ కీపర్ – రూ.1.20 కోట్లు
 5. మోహిత్ శర్మ – బౌలర్ – రూ.50 లక్షలు
 6. ఓడియన్ స్మిత్ – ఆల్ రౌండర్ – రూ.50 లక్షలు
 7. ఉర్విల్ పటేల్ – వికెట్ కీపర్ – రూ.20 లక్షలు

కోల్‌కతా నైట్ రైడర్స్:

 1. షకీబ్ అల్ హసన్ – ఆల్ రౌండర్ – రూ.1.50 కోట్లు
 2. డేవిడ్ వైస్ – ఆల్ రౌండర్ – రూ.1 కోట్లు
 3. ఎన్.జగదీసన్ – వికెట్ కీపర్ – రూ.90 లక్షలు
 4. వైభవ్ అరోరా – బౌలర్ – రూ.60 లక్షలు
 5. మన్‌దీప్ సింగ్ – బ్యాటర్ – రూ.50 లక్షలు
 6. లిట్టన్ దాస్ – వికెట్ కీపర్ – రూ.50 లక్షలు
 7. కుల్వంత్ ఖేజ్రోలియా – బౌలర్ – రూ.20 లక్షలు
 8. సుయాష్ శర్మ – బౌలర్ – రూ.20 లక్షలు

లక్నో సూపర్ జెయింట్స్:

 1. నికోలస్ పూరన్ – వికెట్ కీపర్ – రూ.16 కోట్లు
 2. డానియల్ సామ్స్ ఆల్ రౌండర్ – రూ.75 లక్షలు
 3. అమిత్ మిశ్రా – బౌలర్ – రూ.50 లక్షలు
 4. రొమారియో షెపర్డ్ – ఆల్ రౌండర్ – రూ.50 లక్షలు
 5. నవీన్ ఉల్ హక్ – బౌలర్ – రూ.50 లక్షలు
 6. జయదేవ్ ఉనద్కత్ – బౌలర్ – రూ.50 లక్షలు
 7. యశ్ ఠాకూర్ – బౌలర్ – రూ.45 లక్షలు
 8. స్వప్నిల్ సింగ్ – ఆల్ రౌండర్ – రూ.20 లక్షలు
 9. యుధ్వీర్ చరక్ – ఆల్ రౌండర్ – రూ.20 లక్షలు
 10. ప్రేరక్ మన్కడ్ – ఆల్ రౌండర్ – రూ.20 లక్షలు

ముంబయి ఇండియన్స్‌:

 1. కామెరాన్ గ్రీన్ ఓవర్సీస్ – ఆల్ రౌండర్ – రూ.17.50 కోట్లు
 2. ఝే రిచర్డ్‌సన్ – బౌలర్ – రూ.1.50 కోట్లు
 3. పీయూష్ చావ్లా – బౌలర్ – రూ.50 లక్షలు
 4. నేహాల్ వధేరా – ఆల్ రౌండర్ – రూ.20 లక్షలు
 5. రాఘవ్ గోయల్ – బౌలర్ – రూ.20 లక్షలు
 6. విష్ణు వినోద్ – వికెట్ కీపర్ – రూ.20 లక్షలు
 7. డువాన్ జాన్సెన్ – ఆల్ రౌండర్ – రూ.20 లక్షలు
 8. షామ్స్ ములాని – ఆల్ రౌండర్ – రూ.20 లక్షలు

పంజాబ్ కింగ్స్‌:

 1. సామ్ కర్రాన్ – ఆల్ రౌండర్ – రూ.18.50 కోట్లు
 2. సికందర్ రజా – ఆల్ రౌండర్ – రూ.50 లక్షలు
 3. హర్‌ప్రీత్ భాటియా – బ్యాటర్ – రూ.40 లక్షలు
 4. శివమ్ సింగ్ – ఆల్ రౌండర్ – రూ.20 లక్షలు
 5. విద్వాత్ కవేరప్ప – బౌలర్ – రూ.20 లక్షలు
 6. మోహిత్ రాథీ – ఆల్ రౌండర్ – రూ.20 లక్షలు

రాజస్థాన్ రాయల్స్‌:

 1. జాసన్ హోల్డర్ – ఆల్ రౌండర్ – రూ.5.75 కోట్లు
 2. ఆడమ్ జంపా – బౌలర్ – రూ.1.50 కోట్లు
 3. జో రూట్ – బ్యాటర్ – రూ.1 కోటి
 4. డోనోవన్ ఫెరీరా – వికెట్ కీపర్ – రూ.50 లక్షలు
 5. కె.ఎం.ఆసిఫ్ – బౌలర్ – రూ.30 లక్షలు
 6. అబ్దుల్ పీఏ – ఆల్ రౌండర్ – రూ.20 లక్షలు
 7. ఆకాష్ వశిష్ట్ – ఆల్ రౌండర్ – రూ.20 లక్షలు
 8. కునాల్ రాథోడ్ – వికెట్ కీపర్ – రూ.20 లక్షలు
 9. మురుగన్ అశ్విన్ – బౌలర్ – రూ.20 లక్షలు

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగుళూరు :

 1. విల్ జాక్స్ – బ్యాటర్ – రూ.3.20 కోట్లు
 2. రీస్ టాప్లీ – బౌలర్ – రూ.1.90 కోట్లు
 3. రాజన్ కుమార్ – బౌలర్ – రూ.70 లక్షలు
 4. అవినాష్ సింగ్ – బౌలర్ – రూ.60 లక్షలు
 5. సోనూ యాదవ్ – ఆల్ రౌండర్ – రూ.20 లక్షలు
 6. హిమాన్షు శర్మ – బౌలర్ – రూ.20 లక్షలు
 7. మనోజ్ భాండాగే – ఆల్ రౌండర్ – రూ.20 లక్షలు

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌:

 1. హ్యారీ బ్రూక్ – బ్యాటర్ – రూ.13.25 కోట్లు
 2. మయాంక్ అగర్వాల్ – బ్యాటర్ – రూ.8.25 కోట్లు
 3. హెన్రిచ్ క్లాసెన్ – వికెట్ కీపర్ – రూ.5.25 కోట్లు
 4. వివ్రంత్ శర్మ – ఆల్ రౌండర్ – రూ.2.60 కోట్లు
 5. ఆదిల్ రషీద్ – బౌలర్ – రూ.2 కోట్లు
 6. మయాంక్ దాగర్ – ఆల్ రౌండర్ – రూ.1.80 కోట్లు
 7. అకేల్ హోసేన్ – బౌలర్ – రూ.1 కోటి
 8. మయాంక్ మార్కండే – బౌలర్ – రూ.50 లక్షలు
 9. ఉపేంద్ర సింగ్ యాదవ్ – వికెట్ కీపర్ – రూ.25 లక్షలు
 10. సన్వీర్ సింగ్ – ఆల్ రౌండర్ – రూ.20 లక్షలు
 11. అన్మోల్‌ప్రీత్ సింగ్ – బ్యాటర్ – రూ.20 లక్షలు
 12. సమర్థ్ వ్యాస్ – ఆల్ రౌండర్ – రూ.20 లక్షలు
 13. నితీష్ కుమార్ రెడ్డి – వికెట్ కీపర్ – రూ.20 లక్షలు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + 14 =