భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన నాలుగో టెస్టు భారత క్రికెట్ జట్టుకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. 340 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 155 పరుగులకే ఆలౌట్ కావడంతో ఆస్ట్రేలియా 184 పరుగుల తేడాతో గెలిచింది. ఈ పరాజయం భారత జట్టులో పలు సమస్యలను బయటపెట్టింది.
కెప్టెన్ రోహిత్ శర్మ స్పందన
మ్యాచ్ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ బాక్సింగ్ డే టెస్టు ఓటమి చాలా నిరాశకరమని, జట్టుగా కొన్ని ముఖ్యమైన మార్పులు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. బుమ్రా ప్రదర్శన అద్భుతమని ప్రశంసించిన రోహిత్, నితీశ్ రెడ్డి తొలి టెస్టులో సెంచరీ చేయడం జట్టు కోసం చారిత్రాత్మక ఘట్టమని అన్నారు.
అభిమానులు మాత్రం భారత టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమవడం ఈ ఓటమికి కారణమని మండిపడుతున్నారు. రోహిత్ శర్మ (9), విరాట్ కోహ్లీ (5), కేఎల్ రాహుల్ (డకౌట్) వంటి బ్యాటర్లు చెత్త ప్రదర్శనతో నిరాశపరిచారు. ఈ సిరీస్‌లో రోహిత్, విరాట్‌ల నిరవధిక ఫామ్‌పై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి మాట్లాడుతూ రోహిత్ శర్మ ఫుట్‌వర్క్ మునుపటి లా లేదని, అతని టెస్టు భవిష్యత్తు అనుమానాస్పదంగా మారిందని అభిప్రాయపడ్డారు. విరాట్ కోహ్లీ మరో 3-4 సంవత్సరాలు ఆడతాడని నమ్ముతున్నానని, అయితే రోహిత్ టెస్టుల నుంచి తప్పుకోవడం మంచిదైయ్యుండొచ్చని తెలిపారు.
విరాట్ కోహ్లీ సెంచరీ చేసినప్పటికీ,` మిగతా ఇన్నింగ్స్‌ల్లో చక్కగా రాణించలేకపోయాడు. రోహిత్ శర్మ సగటు 10 పరుగుల కన్నా తక్కువగా చేయడం జట్టు విజయ అవకాశాలను దెబ్బతీసింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 2-1 ఆధిక్యంలో ఉంది. ఐదో టెస్టు సిడ్నీలో జరగనుండగా, భారత్ విజయం సాధించి సిరీస్‌ను సమం చేయగలదా అనేది అభిమానుల్లో ఉత్కంఠ కలిగిస్తోంది.