క్రికెట్ సౌత్ ఆఫ్రికా కీలక ప్రకటన, ఐపీఎల్ తరహాలో కొత్త టీ20 లీగ్ ప్రారంభం

Cricket South Africa Announces New Franchise Based T20 Competition with Six Teams, Cricket South Africa Announces New Franchise based T20 League, Cricket South Africa Announces New Franchise Based T20 Competition, Cricket South Africa announces new franchise based T20 tournament, Cricket South Africa has announced the launch of a new franchise-based T20 tournament, franchise-based T20 tournament, Cricket South Africa, T20 tournament, T20 Competition, T20 League, Cricket South Africa T20 Competition with Six Teams, South Africa T20 League, South Africa T20 League News, South Africa T20 League Latest News, South Africa T20 League Latest Updates, Cricket Latest Updates, Cricket Latest News, Mango News, Mango News Telugu,

ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సహా పలు టీ20 లీగ్స్ క్రీడాభిమానులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డు క్రికెట్ సౌత్ ఆఫ్రికా తాజాగా కీలక ప్రకటన చేసింది. మరో కొత్త T20 పోటీని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తునట్టు ప్రకటించింది. క్రికెట్ సౌత్ ఆఫ్రికా మరియు సూపర్‌స్పోర్ట్ కొత్త టీ20 పోటీని నిర్వహించే కొత్త కంపెనీని ఏర్పాటు చేయడానికి ఒక ఒప్పందంపై సంతకం చేశాయని ప్రకటించారు. ఈ టీ20 లీగ్ జనవరి 2023లో ప్రారంభించేలా ప్రణాళికలు జరుగుతున్నాయన్నారు.

ఇందులో మొత్తం ఆరు ప్రైవేట్ ఫ్రాంచైజీ ఉంటాయన్నారు. ఇక ఆరు జట్లు కూడా ప్రతి ఒక్క జట్టుతో రెండేసి మ్యాచ్‌లు ఆడుతాయని, మొదటి మూడు స్థానాల్లో నిలిచిన జట్లు ప్లేఆఫ్ దశకు వెళ్తాయని పేర్కొన్నారు. మొత్తం 33 మ్యాచ్‌లు జరిగే ఈ టోర్నీ 3 నుంచి 4వారాలు కొనసాగుతుందని, ప్రతి జట్టు ప్లేయింగ్ ఎలెవన్ లో సౌత్ ఆఫ్రికా ఆటగాళ్లతో పాటుగా నలుగురు అంతర్జాతీయ ఆటగాళ్లను ఆడించొచ్చని తెలిపారు.

ఈ టీ20 లీగ్ యొక్క పేరును అధికారిక ప్రారంభోత్సవంలో ప్రకటిస్తామని, అలాగే మ్యాచ్‌ షెడ్యూల్ వివరాలు సహా దక్షిణాఫ్రికాలో ప్రకటించిన తేదీల్లో ఆటగాళ్ల వేలం జరుగుతుందన్నారు. ఈ టీ20 లీగ్ పై క్రికెట్ సౌత్ ఆఫ్రికా సీఈవో ఫోలెక్సీ మోజెకీ స్పందిస్తూ, ఫ్రాంఛైజీలలోకి ప్రైవేట్ పెట్టుబడికి అవకాశం కల్పిస్తున్న ఈ తాజా మరియు ఉత్తేజకరమైన లీగ్ ఏర్పాటు చేయడం పట్ల సంతోషిస్తున్నామని పేర్కొన్నారు. ఈ విషయంలో క్రికెట్ సౌత్ ఆఫ్రికా ఇప్పటికే అనేక స్థానిక మరియు అంతర్జాతీయ పెట్టుబడిదారుల నుంచి మంచి స్పందన, ఆసక్తి పొందిందన్నారు. ఇది పూర్తిగా కొత్త ఈవెంట్ అని, ఈ ఫ్రాంచైజీ లీగ్ ద్వారా సౌత్ ఆఫ్రికా ఆటగాళ్ల గొప్ప ప్రతిభ బహిర్గతం అవుతుందని చెప్పారు. ఇక ఈ లీగ్ లో అన్ని మ్యాచ్‌ లను సూపర్‌స్పోర్ట్ ప్రత్యక్ష ప్రసారం చేయనుండగా, అంతర్జాతీయ టెలివిజన్ మార్కెట్ కోసం ప్రపంచ ఫీడ్‌ను కూడా అందించనుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × three =