గాంధీ ఆసుపత్రి నుంచి కరోనా సోకిన నలుగురు ఖైదీలు పరారీ

4 Covid-19 Infected Prisoners Escaped, 4 Covid-19 Infected Prisoners Escaped From Gandhi Hospital, Coronavirus, Coronavirus Breaking News, Coronavirus Latest News, Covid-19 Infected Prisoners Escaped, Four prisoners escape from Gandhi Hospital, Gandhi Hospital, Telangana Coronavirus, Telangana Coronavirus Cases

హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రి నుంచి కరోనా కు చికిత్స పొందుతున్న నలుగురు ఖైదీలు పరారయ్యారు. చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్న ఈ న‌లుగురు ఖైదీలకు కరోనా వైరస్ పరీక్షల్లో పాజిటివ్ గా తేలడంతో చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న క్రమంలోనే ఎస్కార్ట్‌ పోలీసుల కళ్లుగప్పి పారిపోవడం కలకలం సృష్టించింది. గురువారం తెల్లవారుజాము సమయంలో ఆసుపత్రి మెయిన్ బిల్డింగ్‌ యొక్క రెండవ అంతస్తులో బాత్ రూమ్ గ్రిల్స్ తొలగించి ఈ ఖైదీలు పారిపోయినట్టుగా గుర్తించారు. మొత్తం 10 మంది ఖైదీలు గాంధీ ఆసుపత్రిలో కరోనాకు చికిత్స పొందుతుండగా, వారిలో నలుగురు పారిపోయినట్టుగా అధికారులు తెలిపారు. సీసీ పుటేజీని పరిశీలించిన పోలీసులు, పారిపోయిన ఖైదీల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu