ఆలేరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నేత బూడిద భిక్షమయ్య గౌడ్ మంగళవారం ఉదయం భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ ఛుగ్, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో భిక్షమయ్య గౌడ్ బీజేపీలో చేరి, కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భిక్షమయ్య గౌడ్ మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి కోసమే బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు.
ముందుగా కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్న భిక్షమయ్య గౌడ్, 2014, 2018 ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. అనంతరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తాజాగా టీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్టు ఆయన ప్రజలకు ఓ లేఖ రాశారు. ఆలేరు నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల కష్టాలు తీర్చేందుకు తాను 2018లో టీఆర్‌ఎస్ పార్టీలో చేరానని, అయితే అభివృద్ధిలో తనను భాగస్వామిని చేయడం లేదని, ప్రజల నుంచి తనను వేరు చేసే కుట్ర చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ఆలేరు ప్రజలకు సేవ చేసేందుకే బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు భిక్షమయ్య గౌడ్ తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ




































