ఫేక్ న్యూస్,ఫేక్ సమాచారం వ్యాప్తి: 22 యూట్యూబ్ ఛానెల్స్ పై కేంద్రం నిషేధం

Ministry of Information and Broadcasting Bans 22 YouTube Based News Channels for Spreading Fake News, Ministry of Information and Broadcasting Bans 22 YouTube Channels for Spreading Fake News, Spreading Fake News, 22 YouTube Channels Bans For Spreading Fake News, Fake News, Ministry of Information and Broadcasting, Ministry of Information, Ministry of Broadcasting, 22 YouTube Channels Banned, 22 YouTube Channels, YouTube Channels Banned, Fake News 22 YouTube Channels Banned, Fake News YouTube Channels Banned, YouTube Channels Banned Latest News, YouTube Channels Banned Latest Updates, YouTube Channels, News YouTube Channels, Mango News, Mango News Telugu,

దేశ భద్రతా దృష్ట్యా 22 యూట్యూబ్ ఛానెల్స్, 3 ట్విట్టర్ ఖాతాలు, ఒక పేస్ బుక్ అకౌంట్, ఒక న్యూస్ వెబ్‌సైట్ పై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ 22 యూట్యూబ్ ఛానెల్స్ లో 18 దేశీయ ఛానెల్స్ కాగా 4 పాకిస్తాన్ కి చెందినవి ఉన్నట్టు తెలిపారు. ఐటీ రూల్స్, 2021 కింద అత్యవసర అధికారాలను ఉపయోగించుకుని వీటిపై నిషేధ ఉత్తర్వులు జారీ చేస్తునట్టు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గత ఏడాది ఫిబ్రవరిలో ఐటి రూల్స్, 2021 నోటిఫికేషన్ వచ్చిన తర్వాత భారతీయ/దేశీయ యూట్యూబ్ ఆధారిత న్యూస్ పబ్లిషర్స్ పై చర్య తీసుకోవడం ఇదే మొదటిసారని చెప్పారు.

బ్లాక్ చేయబడిన యూట్యూబ్ ఛానెల్స్ యొక్క సంచిత వీక్షకుల సంఖ్య 260 కోట్లకు పైగా ఉందన్నారు. జాతీయ భద్రత, దేశం యొక్క విదేశీ సంబంధాలు మరియు పబ్లిక్ ఆర్డర్ దృక్కోణం నుండి సున్నితమైన విషయాలపై సోషల్ మీడియాలో తప్పుడు వార్తలను ప్రసారం చేయడం, సమన్వయంతో కూడిన తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి ఈ ఛానెల్స్ ఉపయోగించబడ్డాయని పేర్కొన్నారు. కాగా తాజా నిర్ణయంతో డిసెంబర్ 2021 నుండి జాతీయ భద్రత, సార్వభౌమాధికారం మరియు భారతదేశ సమగ్రత, పబ్లిక్ ఆర్డర్ మొదలైన వాటికి సంబంధించిన కారణాలపై ఇప్పటివరకు 78 యూట్యూబ్ ఆధారిత న్యూస్ ఛానెల్స్ మరియు అనేక ఇతర సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ చేస్తూ కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

దేశీయ యూట్యూబ్ ఛానల్స్ (18):

  1. ARP News
  2. AOP News
  3. LDC News
  4. SarkariBabu
  5. SS ZONE Hindi
  6. Smart News
  7. News23Hindi
  8. Online Khabar
  9. DP news
  10. PKB News
  11. KisanTak
  12. Borana News
  13. Sarkari News Update
  14. Bharat Mausam
  15. RJ ZONE 6
  16. Exam Report
  17. Digi Gurukul
  18. दिनभरकीखबरें

పాకిస్తాన్ ఆధారిత యూట్యూబ్ ఛానెల్స్:

  1. DuniyaMeryAagy
  2. Ghulam NabiMadni
  3. HAQEEQAT TV
  4. HAQEEQAT TV 2.0
  • పేస్ బుక్ అకౌంట్ : DunyaMeryAagy
  • న్యూస్ వెబ్‌సైట్ : Dunya Mere Aagy
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 12 =