కోవిడ్ రోగులకు సేవలందించడంలో దేశంలోనే నెం. 1 హైదరాబాద్ గాంధీ హాస్పిటల్

Corona Virus Gandhi Hospital, coronavirus gandhi hospital, First Hospital To Treat Highest COVID-19 Patients, Gandhi Hospital, Gandhi Hospital Becomes First Hospital, Gandhi Hospital Becomes First Hospital To Treat Highest COVID-19 Patients, Gandhi Hospital Becomes First Hospital To Treat Highest COVID-19 Patients In India, Gandhi Hospital Doctors, Gandhi Hospital Tops In Treating Highest Number Of Covid Patients, Gandhi Hospital Tops In Treating Highest Number Of Covid Patients In Country, Hyderabad, Hyderabad Gandhi Hospital, Mango News, MangoNews, Telangana Gandhi Hospital

దేశంలోనే పెద్ద సంఖ్యలో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న ఆసుపత్రిగా హైదరాబాద్ గాంధీ ఆసుపత్రి మొదటి స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు గాంధీ ఆసుపత్రి దేశంలో అత్యధిక కోవిడ్ రోగులకు చికిత్స అందించింది. కోవిడ్-19 మొదలయిననాటి నుండి గాంధీ ఆసుపత్రిలో 84,127 మంది రోగులు కరోనావైరస్ బారిన పడి చికిత్స పొందారని గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం రాజారావు తెలిపారు. మెరుగైన వైద్యం అందించడంలో గాంధీ ఆసుపత్రి ఎప్పుడూ ముందుంటుందని సూపరింటెండెంట్ అన్నారు.

దేశంలో మరే ఇతర ఆసుపత్రి కూడా ఇంత మంది రోగులకు చికిత్స చేయలేదు. కోవిడ్‌కు చికిత్స పొందిన వారిలో 3,762 మంది 14 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఉన్నారు. అదనంగా హై-రిస్క్ గ్రూపులకు చెందిన 8,178 మంది డయాలసిస్ రోగులు కూడా చికిత్స పొందారు అని డాక్టర్ రాజారావు తెలిపారు.

ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో 44 మంది కోవిడ్‌ రోగులు మాత్రమే చికిత్స పొందుతున్నారు. కరోనాతో పాటు, ఆసుపత్రిలోని వైద్యులు బ్లాక్ ఫంగస్ రోగులకు కూడా చికిత్స చేశారు. బ్లాక్ ఫంగస్ బాధితులు ఇప్పటి వరకు 1,786 మంది ఆసుపత్రిలో చేరారని, వీరిలో 1,163 మందికి శస్త్రచికిత్సలు చేసి ప్రాణాలు కాపాడామని చెప్పారు. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి ఎక్కువ మంది బ్లాక్ ఫంగస్ రోగులు వచ్చారన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 1 =