
ఏదైనా సిటీ ఇంత ఫాస్ట్‌గా డెవలప్ అవగలదా అంటే అవుతుంది దానికి హైదరాబాదే బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెబుతున్నారు చాలామంది. నిజమే రెండేళ్లు హైదరాబాద్ రాని వాళ్లు సిటీలోకి అడుగుపెడితే అబ్బా భాగ్యనగరం ఎంత మారిపోయింది అని ముక్కున వేలేసుకునేలా చేయడం ఒక్క హైదరాబాద్‌కే సొంతం అవుతుందేమో. అందుకే తెలంగాణ ప్రభుత్వానికి హైదరాబాద్ ఎప్పుడూ మణిహారం లాంటిదనే అంటారు. హైదరాబాద్ అభివృద్ధి దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యతను సంతరించుకుంటుంది.
హైదరాబాద్ లో చూడవలసిన పర్యాటక కేంద్రాలే కాదు.. ఐటీతో పాటు వివిధ ఇండస్ట్రీలు రోజురోజుకు విస్తరిస్తూనే ఉంటాయి. అలా హైదరాబాద్ అందాన్ని పెంచేలా దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జిని చూడటానికి ప్రతి రోజు వేల సంఖ్యలో ప్రజలు వెళ్తుంటారు. అందుకే మరో కేబుల్ బ్రిడ్జిని కూడా హైదరాబాద్‌లో నిర్మించడానికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మీరాలం చెరువు ఈస్ట్ సైడ్ చింతల్ మెట్ నుంచి బెంగళూరు టూ హైదరాబాద్ నేషనల్ హైవే-44 కు కలిపేలా .. ఓ భారీ కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి అనుమతులు మంజూరు అయ్యాయి.
హైదరాబాద్‌లో రెడీ అవబోతున్న ఈ సుందరమైన కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి హెచ్ఎండీఏ ప్లాన్ చేస్తుంది. చింతల్ మెట్ నుంచి బెంగళూరు టూ హైదరాబాద్ జాతీయ రహదారి వరకు మొత్తం 4 లైన్ల రోడ్డు 2.65 కి.మీటర్ల పొడవు వేయనున్నారు. ఈ కేబుల్ బ్రిడ్జికి రెండు చోట్ల ఎంట్రీ ర్యాంపులతో పాటు.. ఒక చోట ఎగ్జిట్ ర్యాంప్ ఉండేలా హెచ్ఎండీఏ అధికారులు ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ కేబుల్ బ్రిడ్జి నిర్మాణం జరిగితే హైదరాబాద్ సిగలో మరో మణిహారం వచ్చి చేరినట్లే అవుతుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE