జూబ్లీహిల్స్‌లో సీన్ రివర్స్‌ కాబోతోందా?

Will the scene reverse in Jubilee Hills,Will the scene reverse,reverse in Jubilee Hills,jubille hills, brs, congress, brs, telangana assembly elections,Mango News,Mango News Telugu,Jubilee Hills Latest News,Jubilee Hills Latest Updates,Telangana Assembly Elections 2023,assembly seat, BJP,BRS, Congress,Telangana elections Latest Updates,Telangana elections Live News,Telangana elections Latest News,Telangana Politics, Telangana Political News And Updates,Hyderabad News
jubille hills, brs, congress, brs, telangana assembly elections

నగరంలో అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గం జూబ్లీహిల్స్‌. కొద్ది రోజులుగా ఇక్కడ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. తొలుత ఇక్కడ అధికారపార్టీ బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ మాత్రమే ఎన్నికల బరిలో ఉంటారని అందరూ భావించారు. అనూహ్యగా ఎంఐఎం కూడా పోటీలో నిలిచింది. కాంగ్రెస్‌ నుంచి మైనారిటీ అభ్యర్థి పోటీలో ఉండడంతో ఓట్లు చీల్చి బీఆర్‌ఎస్‌ గెలుపునకు సహకరించడానికే ఎంఐఎం పోటీలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. కానీ నాలుగు పార్టీల మధ్య తీవ్రమైన పోటీ మొదలైంది. 2014 ఎన్నికల్లో ఎంఐఎం మొదటి సారి ఇక్క పోటీ చేసింది. ఓటమి పాలవ్వడంతో 2018లో ఆసక్తి కనబర్చలేదు.

పి.జనార్దన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహించిన ఖైరతాబాద్‌ నుంచి 2009లో విభజించిన మూడు నియోజకవర్గాల్లో జూబ్లీహిల్స్‌ ఒకటి. అప్పటి ఖైరతాబాద్‌ సిటింగ్‌ ఎమ్మెల్యే, పీజేఆర్‌ తనయుడు, పి.విష్ణువర్ధన్‌రెడ్డి జూబ్లీహిల్స్‌ను ఎంచుకొని 2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిపై విజయం సాధించారు. అనంతరం 2014 ఎన్నికల్లో ఇక్కడి నుంచి టీడీపీ తరఫున మాగంటి గోపీనాథ్‌ గెలుపొందారు. ఈ ఎన్నికల్లో ఎంఐఎం తరఫున పోటీ చేసిన నవీన్‌యాదవ్‌ రెండో స్థానం పొందగా, కాంగ్రెస్‌ అభ్యర్థి విష్ణు మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. ఆ తరువాత గోపీనాథ్‌ బీఆర్‌ఎస్‌లో చేరి.. 2018 ఎన్నికల్లో కారు గుర్తుపై పోటీ చేశారు. విష్ణువర్ధన్‌రెడ్డి.. మహాకూటమిలో భాగంగా టీడీపీ మద్దతుతో కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఈ ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేయకుండా బీఆర్‌ఎ్‌సకు మద్దతు ఇవ్వడంతో గోపీనాథ్‌ 16 వేల ఓట్ల మెజారిటీతో మరోసారి గెలుపొందారు. ఎంఐఎం నాయకత్వంతో విభేదిస్తూ నవీన్‌యాదవ్‌ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి సుమారు 19 ఓట్లు సాధించారు. తాజా ఎన్నికల్లో పరిస్థితులు పూర్తిగా మారాయి. అన్ని పార్టీలూ పూర్తిస్థాయి బలం, బలగంతో రంగంలోకి దిగాయి.

నియోజకవర్గంలో 3.75 లక్షల ఓటర్లు ఉన్నారు. వీరిలో 1.05 లక్షల నుంచి 1.10 లక్షల మంది మైనారిటీ ఓటర్లు ఉన్నారు. ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయి,. ప్రతి ఎన్నికల్లో వీరే న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తుంటారు. ఈ ఓటు బ్యాంకు కోసం బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ప్రతి నిత్యం వ్యూహాలు రచిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా షేక్‌పేట, ఎర్రగడ్డ, రహ్మత్‌నగర్‌, బోరబండ డివిజన్‌లలు మైనారిటీలు అధికంగా ఉన్నారు. షేక్‌పేట సుమారు 40 వేల మంది మైనారిటీ ఓటర్లు ఉంటారని అంచనా. దీంతో ఆయా డివిజన్‌లలో ఓటు బ్యాంకును కొల్లగొట్టేందుకు బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లు ప్రయత్నాలు చేశాయి.

టీడీపీ తరఫున ఎన్నికై బీఆర్‌ఎస్‌లో చేరిన మాగంటి గోపీనాథ్‌కు 2018 ఎన్నికల్లో పార్టీ టికెట్‌ కేటాయించగా.. స్థానిక కార్పొరేటర్లు ఆయన అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా, విజయం ఆయననే వరించింది. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్న గోపీనాథ్‌.. హ్యాట్రిక్‌ విజయం పై ఆశలు పెట్టుకున్నారు. ఒకసారి ఎమ్మెల్యే, వరుసగా రెండు సార్లు జూబ్లీహిల్స్‌ నుంచి పోటీచేసి ఓడిపోయిన విష్ణువర్ధన్‌రెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరి ఈసారి మాగంటికి అండగా నిలిచారు. మరోవైపు  ఒకప్పుడు పీజేఆర్‌ వెంట ఉన్న సీనియర్లు అజరుద్దీన్‌ వెంట నిలిచారు. దీనికితోడు మరోసారి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన నవీన్‌యాదవ్‌ను పోటీ నుంచి కాంగ్రెస్‌ విరమింపజేసి తమ పార్టీలో చేర్చుకుంది. ఆయనకు నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించింది. దీంతో పోటీ రసకవత్తరంగా మారింది. గెలుపు ఎవరిది అనేది అంచనాలకు అందడం లేదు. బీజేపీ నుంచి లంక‌ల దీప‌క్ రెడ్డి, ఎంఐఎం నుంచి ఫ‌రాజుద్దీన్ పోటీలో ఉన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + 16 =