మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ టికెట్ కోసం ఆరుగురు పోటీ

Six People are Contesting for Malkajgiri BJP MP ticket,Six People are Contesting,Contesting for Malkajgiri,Malkajgiri BJP MP ticket,Six Leaders, Malkajgiri, BJP MP ticket, lok sabha elections,Mango News,Mango News Telugu,Malkajgiri BJP MP ticket Latest News,Malkajgiri BJP MP ticket Latest Updates,Malkajgiri BJP MP ticket Latest Updates,Telangana Politics, Telangana Political News And Updates,Malkajgiri Latest News,Malkajgiri Live Updates
Six Leaders, Malkajgiri, BJP MP ticket, lok sabha elections

లోక్ సభ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. మూడు నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలపై ఫోకస్ పెట్టేశాయి. గెలుపే లక్ష్యంగా అస్త్రాలను రెడీ చేసుకుంటున్నాయి. తెలంగాణలో ఇప్పటి నుంచే లోక్ సభ ఎన్నికల వేడి భగ్గుమంటోంది. మెజార్టీ స్థానాలను దక్కించుకోవాలని బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. ప్రస్తుతం అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి. అయితే బీజేపీలో ఎంపీ టికెట్ కోసం తీవ్ర పోటీ నెలకొంది. ముఖ్యంగా దేశంలోనే అతిపెద్ద లోక్ సభ నియోజకవర్గమైన మల్కాజ్‌గిరి టికెట్ కోసం పెద్ద ఎత్తున నేతలు పోటీ పడుతున్నారు.

మల్కాజ్‌గిరి నియోజకవర్గాన్ని ఈసారి ఎలాగైనా గెలుచుకోవాలని బీజేపీ తహతహలాడుతోంది. ఇందుకోసం బలమైన అభ్యర్థిని బరిలోకి దింపేందుకు కసరత్తు చేస్తోంది.  అయితే మల్కాజ్‌గిరి బీజేపీ టికెట్ కోసం ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఆరుగురు నేతలు పోటీ పడుతున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలయిన కీలక నేతలతో పాటు.. సీనియర్లు.. పారిశ్రామిక వేత్తలు మల్కాజ్‌గిరి ఎంపీ టికెట్ కోసం పోటీపడుతున్నారు. ఇప్పటికే కొందరు నేతలు తమకే టికెట్ దక్కుతుందనే నమ్మకంతో నియోజకవర్గంలో ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు.

ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఈటల రాజేందర్ రెండు చోట్ల పోటీ చేసి ఓటమిపాలయిన విషయం తెలిసిందే. హుజురాబాద్, గజ్వేల్ నుంచి పోటీ చేసి రెండు చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థుల చేతిలో ఓడిపోయారు. ఈక్రమంలో మల్కాజ్‌గిరి నుంచి ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే టికెట్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. అటు ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ అధినేత మల్క కొమురయ్య.. బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్‌ఛార్జ్‌ మురళీధర్ రావు.. మాజీ ఎంపీ చాడ సురేష్ రెడ్డి.. మాజీ హోం మంత్రి దేవేందర్ గౌడ్ కుమారుడు వీరేందర్ గౌడ్.. పన్నాల హరీష్ రెడ్డిలు టికెట్ కోసం పోటీపడుతున్న వారిలో ఉన్నారు.

రెండు సంవత్సరాలుగా మురళీధర్ రావు నియోజకవర్గ ప్రజలకు దగ్గరగా ఉంటున్నారు. ఆత్మీయ సమ్మేళనాలు, సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో కలియతిరుగుతున్నారు. మిగిలిన నేతలు కూడా మల్కాజ్‌గిరలో తమ హవా చాటుకునేందుకు పలు రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే టికెట్ తమకే ఇవ్వాలని హైకమాండ్ వద్ద పట్టుపట్టుకొని కూర్చున్నారు. మరి వీరిలో మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ టికెట్ ఎవరికి దక్కుతుందనేది చూడాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − 1 =