తెలంగాణలో మరో ఎమ్మెల్యేకి కరోనా, ఇప్పటిదాకా ముగ్గురికి పాజిటివ్ గా నిర్ధారణ

Coronavirus, Coronavirus Breaking News, COVID-19, India COVID 19 Cases, Nizamabad MLA Corona, telangana, Telangana Coronavirus, Telangana Coronavirus Deaths, Telangana MLA Covid-19, Telangana MLA Covid-19 Case, Telangana MLA Tested with Covid-19, Total COVID 19 Cases

తెలంగాణ రాష్ట్రంలో మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. నిజామాబాద్ అర్బన్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే గణేశ్‌ గుప్తాకు ఈ రోజు కరోనా పాజిటివ్‌గా తేలింది. గత రెండు రోజులుగా ఆయనలో కరోనా లక్షణాలు కనిపించడంతో, పరీక్షలు నిర్వహించగా ఫలితం పాజిటివ్ గా వచ్చింది. దీంతో ఆయన వెంటనే క్వారంటైన్‌కు వెళ్లి చికిత్స తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. కరోనా పరీక్షల్లో ఆదివారం నాడు నిజామాబాద్‌ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ కి పాజిటివ్ గా తేలిన సంగతి తెలిసిందే. కాగా ఎమ్మెల్యే గణేశ్‌ గుప్తా ఇటీవల పలు కార్యక్రమాల్లో బాజిరెడ్డి గోవర్దన్ తో కలిసి పాల్గొన్నట్లు తెలుస్తుంది.

ముందుగా రాష్ట్రంలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి కరోనా వైరస్ సోకింది. తాజాగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా కరోనా బారిన పడడంతో ఆ సంఖ్య మూడుకు చేరుకుంది. మరోవైపు ఎమ్మెల్యేలకు కరోనా రావడంతో వారి కుటుంబసభ్యులను, అనుచరులను, వారి కార్యక్రమాల్లో పాల్గొన్న అధికారులను ముందు జాగ్రత్తచర్యల్లో భాగంగా హోం క్వారంటైన్‌కు తరలించి, లక్షణాలను బట్టి పరీక్షలు నిర్వహిస్తున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu