ఏపీలో ఎమ్మెల్సీ భర్తీకి షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ

Andhra Pradesh, Andhra Pradesh Political Updates, AP CM YS Jagan, AP Legislative Council, AP News, AP Vacant MLC Seat, EC Announced Schedule to Fill Vacant MLC Seat, MLC Elections, Vacant MLC Seat In Ap, Vacant MLC Seat in AP Legislative Council

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానం భర్తీ చేసేందుకు జూన్ 15, సోమవారం నాడు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఎమ్మెల్సీగా డొక్కా మాణిక్య వరప్రసాద్‌ పదవీకాలం మార్చ్ 29, 2023 వరకు ఉండగా, ఆయన మార్చ్ 9, 2020 వ తేదీనే రాజీనామా చేశారు. అనంతరం ఆయన వైసీపీ పార్టీలో చేరారు. దీంతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానం వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం, ఈసీ కి పంపించడంతో ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. కాగా శాసనసభ్యుల కోటాలో ఈ స్థానాన్ని భర్తీ చేయనున్నారు. జులై 6న పోలింగ్‌ నిర్వహించి, అదేరోజున సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు పక్రియ చేపట్టనున్నారు.

ఎమ్మెల్సీ భర్తీకి విడుదల చేసిన షెడ్యూల్ వివరాలు:

  • నోటిఫికేషన్‌ విడుదల: జూన్ 18
  • నామినేషన్లు దాఖలకు చివరి తేదీ: జూన్ 25
  • నామినేషన్లను పరిశీలన: జూన్ 26
  • నామినేషన్ల ఉపసంహరణ: జూన్ 29
  • పోలింగ్ తేదీ: జూలై 6 (ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు)
  • కౌంటింగ్ పక్రియ: జూలై 6 (సాయంత్రం 5 గంటల నుంచి)

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − 2 =