
తెలుగు రాష్ట్రాల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నవారంతా సోమవారం సాయంత్రం నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణాలు సాగిస్తున్నారు. ఇప్పటికే చాలామంది హైదరాబాద్ చేరుకోగా..ఈ రోజు ఉదయం తమ సొంత వాహనాలతో బయలుదేరినవారితో ఏపీ, తెలంగాణ నేషనల్ హైవేలు రద్దీగా మారాయి.
నిన్న సాయంత్రం నుంచి సొంతూళ్లకు వెళ్లిన తెలంగాణ ప్రజలు, ఏపీ ప్రజలు ఓట్లు వేసిన తర్వాత హైదరాబాద్ బాట పడుతున్నారు. దీంతో హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై వెహికల్స్ రద్దీ పెరిగింది. ఇటు తెలంగాణలో వివిద జిల్లాలలో ఓట్లున్నవారంతా కూడా సొంత ఊరిలో ఓటు హక్కును వినియోగించుకోవడానికి వెళ్లారు. వారు కూడా హైదరాబాద్ కు తిరుగుపయనం అవడంతో.. ఏపీ, తెలంగాణ ఓటర్ల వల్ల యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్‌ప్లాజా వద్ద కిలోమీటరు మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.
సాధారణ రోజుల్లోనే 30 నుంచి 35 వేల వాహనాలు ఈ టోల్ ప్లాజా నుంచి రాకపోకలు సాగిస్తుంటాయి. మంగళవారం ఉదయం నుంచి అయితే లక్షకు పైగా వాహనాలు హైదరాబాద్ వైపు వస్తున్నట్లు టోల్‌గేట్ సిబ్బంది చెబుతున్నారు. రేపటి వరకూ ఈ వాహనాల రద్దీ కొనసాగనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాలు ఎన్ని స్పెషల్ బస్సులు వేసినా బస్సుల కోసం ప్రజలు బస్టాప్‌ల వద్ద గంటల తరబడి ఎదురు చూసే పరిస్థితే కనిపిస్తోందని కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY