ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌ను క‌లిసిన ఏపీ బీఆర్ఎస్ అధ్య‌క్షుడు తోట చంద్ర‌శేఖ‌ర్, ఇతర నేతలు

AP BRS President Thota Chandrashekar and Other Leaders Met MLC Kavitha in Hyderabad Today, AP BRS President Thota Chandrashekar Met MLC Kavitha in Hyderabad Today, AP BRS Leaders Met MLC Kavitha in Hyderabad Today, BRS MLC Kavitha, AP BRS President Thota Chandrashekar, AP BRS Leaders, Mango News, Mango News Telugu

ఆంధ్రప్రదేశ్ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ అధ్యక్షుడు తోట చంద్ర‌శేఖ‌ర్ ఆ పార్టీ ఎమ్మెల్సీ, ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె క‌ల్వ‌కుంట్ల క‌విత‌ను కలిశారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లోని క‌విత నివాసంలో ఆమెను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సందర్భంగా తోట చంద్రశేఖర్ వెంట ఇతర ఏపీ బీఆర్ఎస్ నేతలు రావెల కిశోర్ బాబు, పార్థ‌సార‌థి మరియు పార్టీ తెలంగాణ సీనియర్ నేత దాసోజు శ్ర‌వ‌ణ్ తదితరులు ఉన్నారు. ఈ సంద‌ర్భంగా ఏపీలో ప్రస్తుత రాజ‌కీయ ప‌రిస్థితులు మరియు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి అవకాశాలు వంటి పలు అంశాల‌పై వారు ఎమ్మెల్సీ క‌విత‌కు వివరించారు. అలాగే ఈ నెల 18న ఖ‌మ్మంలో జ‌రుగనున్న బీఆర్ఎస్ తొలి భారీ బహిరంగ స‌భ‌కు ఏపీ నుంచి కూడా భారీ జనసమీకరణ చేయనున్నట్లు ఆయన తెలిపారు. కాగా తోట చంద్ర‌శేఖ‌ర్‌ను ఏపీ బీఆర్ఎస్ అధ్య‌క్షుడిగా సీఎం కేసీఆర్ ఇటీవల నియ‌మించిన సంగ‌తి తెలిసిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE