ఈనెల 18 నుంచి ప్రారంభమయ్యే ‘కంటి వెలుగు’ ను నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: మంత్రి తలసాని

Minister Talasani Srinivas Yadav Appeals Hyderabad City People to Utilize Kanti Velugu Program which Starts on January 18th, Kanti Velugu Program which Starts on January 18th, Minister Talasani Srinivas Yadav Appeals Hyderabad City People to Utilize Kanti Velugu Program, Kanti Velugu Program, Telangana Minister Talasani Srinivas Yadav, Talasani Srinivas Yadav Appeals Hyderabad City People, Kanti Velugu Program News, Kanti Velugu Program Latest News And Updates, Kanti Velugu Program Live Updates, Mango News, Mango News Telugu

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభించనున్న ‘కంటి వెలుగు’ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని నగర ప్రజలను రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. అంధత్వంతో ఏ ఒక్కరు బాధపడొద్దనే ఆలోచనతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈ గొప్ప కార్యక్రమం చేపట్టారని తెలిపారు. మొదటి విడతలో నిర్వహించిన కంటి వెలుగు కార్యక్రమంలో 1.54 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించి 50 లక్షల మందికి కళ్ళద్దాలు అందజేసినట్లు పేర్కొన్నారు. రెండో విడతలో జూన్ 30 వ తేదీ వరకు నిర్వహించే కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ జిల్లా పరిధిలో 115 కంటి పరీక్ష శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ శిబిరాలలో ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు, కళ్ళద్దాలు ఉచితంగా అందజేయడం జరుగుతుందని అన్నారు.

కంటి ఆపరేషన్ అవసరమైన వారికి ఉచితంగా నే కంటి ఆపరేషన్ లు చేయించడం జరుగుతుందని మంత్రి తెలిపారు. కార్పొరేటర్ లు, మాజీ కార్పొరేటర్ లు, కాలనీలు, బస్తీల కమిటీల సభ్యులు, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు వారి వారి ప్రాంతాలలో విస్తృత ప్రచారం జరిపి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొనే విధంగా కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో 115 శిభిరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, అవసరాన్ని బట్టి అదనపు శిభిరాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here