1984 నుంచి ఇప్పటి వరకూ కూడా ఓవైసీ అడ్డాగానే కొనసాగుతూ వస్తోన్న హైదరాబాద్ లోక్‌సభ స్థానం మరోసారి కూడా అదే ఆనవాయితీని కొనసాగించింది.. ఎంఐఎం నుంచి అసదుద్దీన్ ఓవైసీ . బీజేపీ నుంచి మాధవీలత మధ్య పోటాపోటీగా సాగిన ఈ ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందోనన్న ఉత్కంఠ నెలకొనగా దానికి ఇప్పుడు ఫుల్ స్టాప్ పడింది.
అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన మాధవీలత.. ఓవైసీకి ముచ్చెమటలు పట్టించారనే చెప్పొచ్చు. మొదటి 5 రౌండ్లలో ఆధిక్యత కొనసాగించినా… ఆ తరువాత మెల్లమెల్లగా తన ఆధిక్యాన్ని కోల్పోయారు. చివరకు ఎంఐఎం అభ్యర్థి అసదుద్దన్ ఓవైసీ బీజేపీ అభ్యర్థి మాధవీలతపై 3లక్షల15వేల 811 ఓట్ల ఆధిక్యంతో విజయాన్ని సాధించారు. ఈ ఎన్నికల్లో మాధవీ లతకు 2లక్షల97వేల31 ఓట్లు లభించాయి.
అయితే రీసెంటుగా విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ కూడా హైదరాబాద్ ఓవైసీకి మరోసారి అడ్డాగా ఉండనుందని చెప్పుకొచ్చాయి. అయితే ఈసారి అసదుద్దీన్ మెజారిటీకి భారీగా గండి పడే అవకాశం ఉన్నట్టు కొన్ని సర్వే సంస్థలు వెల్లడించాయి.అయినా కూడా సర్వే ఫలితాలు కాదు నిజమైన ఫలితాలు విజేతనెవరో తేలుస్తాయంటూ చివరివరకూ మాధవీ లత ధీమాను వ్యక్తం చేస్తూ వచ్చారు.
హైదరాబాద్‌లో సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ అత్యధికంగా 6 సార్లు ఎంపీగా ఎన్నికవగా.. ఇప్పటివరకూ సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ కుమారుడు అసదుద్దీన్ ఓవైసీ ఐదోసారి కూడా విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ విధంగా చూసుకుంటే 40 ఏళ్లుగా హైదరాబాద్ లోక్‌సభను ఓవైసీ కుటుంబం అడ్డాగా చేసుకుని పాలిస్తోందన్న సంగతి అర్ధం అవుతోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY