తెలంగాణలో 14 నేషనల్ హైవే ప్రాజెక్టులు: రూ.13,169 కోట్లతో 765 కిలోమీటర్ల రోడ్లు అభివృద్ధి

Nitin Gadkari Inaugurated and Laid Foundation Stone For 14 NH Projects in Telangana,Mango News,Mango News Telugu,Foundation Stones laying And Inauguration program of Telangana NH Projects,Nitin Gadkari Inaugurates and laid Foundation Stone for 14 NH Projects,Telangana,Telangana News,Nitin Gadkari,Nitin Gadkari Inaugurates,Laid Foundation,Nitin Gadkari Inaugurates And Laid Foundation Stone For 14 NH Projects,Telangana National Highway News,Nitin Gadkari inaugurated and laid foundation of 14 NH projects,Nitin Gadkari Inaugurates,Lays Foundation Stone For Highway Projects In Telangana,Gadkari inaugurates lays foundation stone,Highway Projects In Telangana,Union Minister Nitin Gadkari

కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సోమవారం నాడు తెలంగాణ రాష్ట్రంలో వర్చువల్ మోడ్ ద్వారా 14 నేషనల్ హైవే (ఎన్‌హెచ్) ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ ప్రాజెక్టుల ద్వారా మొత్తం 765.663 కిలోమీటర్ల పొడవైన రోడ్లును రూ.13,169 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, వీకే సింగ్‌, తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌ రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, కేంద్ర, రాష్ట్ర అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ప్రారంభించిన ప్రాజెక్టులు ఇవే:

  • ఫోర్ లేనింగ్ ఆఫ్ యాదాద్రి – వరంగల్ – ఎన్‌హెచ్ 163
  • నకిరేకల్ – తనంచెర్ల సెక్షన్ – ఎన్‌హెచ్ 365
  • హైదరాబాద్ ఔటర్‌ రింగ్‌రోడ్డు – మెదక్‌ సెక్షన్ – ఎన్‌హెచ్-765D
  • మన్నెగూడ – రావులపల్లి సెక్షన్ – ఎన్‌హెచ్ 163
  • ఆత్మకూర్ ‌- పరసా సెక్షన్‌ – ఎన్‌హెచ్ 163
  • మహదేవ్‌పూర్‌ – భూపాలపల్లి సెక్షన్‌ – ఎన్‌హెచ్-353C

శంకుస్థాపనలు చేసిన ప్రాజెక్టులు ఇవే:

  • ఫోర్ లేనింగ్ ఆఫ్ సూర్యాపేట – ఖమ్మం – ఎన్‌హెచ్ 65
  • ఫోర్ లేనింగ్ ఆఫ్ మంచిర్యాల – రేపల్లెవాడ – ఎన్‌హెచ్ 363
  • ఫోర్ లేనింగ్ ఆఫ్ రామ్సన్‌పల్లె – మంగళూరు – ఎన్‌హెచ్ 161
  • ఫోర్ లేనింగ్ ఆఫ్ కంది – రామ్సన్‌పల్లె – ఎన్‌హెచ్ 161
  • ఫోర్ లేనింగ్ ఆఫ్ మంగుళూరు – తెలంగాణ/మహారాష్ట్ర బోర్డర్
  • ఫోర్ లేనింగ్ ఆఫ్ రేపల్లెవాడ – తెలంగాణ/మహారాష్ట్ర బోర్డర్ – ఎన్‌హెచ్ 363
  • నకిరేకల్ – నాగార్జునసాగర్ సెక్షన్ బాలన్స్ వర్క్స్ – ఎన్‌హెచ్ 565
  • నిర్మల్ – ఖానాపూర్ సెక్షన్ (వైడ్ నింగ్) – ఎన్‌హెచ్ 61
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + 5 =