తెలంగాణ రాష్ట్రంలోని మహిళలందరూ బతుకమ్మ పండగను సంతోషంతో జరుపుకోవాలనే మంచి సంకల్పంతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రతి ఏటా బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం కూడా అక్టోబర్ 2, శనివారం నుంచి బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే రూ.333 కోట్ల వ్యయంతో 1.08 లక్షల చీరలను సిద్ధం చేశారు. ఈ సంవత్సరం 30 కొత్త డిజైన్లతో, 20 విభిన్న రంగులతో మొత్తం 810 రకాల చీరలను తయారు చేయించారు. చేనేతలకు ఉపాధి కల్పించడంలో భాగంగా సిరిసిల్ల, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తయారు చేసిన ఈ చీరలను రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే బతుకమ్మ చీరలు అన్ని జిల్లా కేంద్రాలకు చేరుకోగా, పంపిణీ విధానంపై జిల్లా కలెక్టర్లు ఆదేశాలు జారీ చేయనున్నారు. ఇక అన్ని గ్రామాల్లో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా మహిళా లబ్ధిదారులకు చీరల పంపిణీ జరగనుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ