తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీతో ఎలాంటి పొత్తు ఉండదని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రస్తుతం రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ యాత్రలో భాగంగా రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, టీఆర్ఎస్ తో పొత్తు విషయంపై స్పందించారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని, ఒంటరిగానే పోటీ చేస్తామన్నారు. టీఆర్ఎస్ తో పొత్తు వద్దని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయించిందని, ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు రాహుల్ గాంధీ చెప్పారు. అలాగే బీఆర్ఎస్ పై స్పందిస్తూ, ఎవరైనా జాతీయ పార్టీ పెట్టుకోవచ్చని, ఎక్కడైనా పోటీ చేయొచ్చని అన్నారు. జాతీయ పార్టీ లేదా గ్లోబల్ పార్టీగా ఊహించుకోవడంలో తప్పులేదని, కాంగ్రెస్ పై ప్రభావం ఉండదన్నారు.
అలాగే దేశ సంస్థాగత చట్రానికి చాలా నష్టం జరిగిందని పత్రికలు, న్యాయవ్యవస్థ, బ్యూరోక్రసీ దాడికి గురవుతున్నాయని రాహుల్ గాంధీ అన్నారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌లు వేల కోట్లు ఖర్చు చేస్తున్నాయి, ఎలాంటి నిబంధనలు లేకుండా పంపిణీ చేయబడుతోంది కాబట్టి వారు ఎంత సారూప్యత కలిగి ఉన్నారో, ఎన్నికలను ప్రభావితం చేయడానికి వారు ఈ డబ్బును ఎలా ఉపయోగిస్తున్నారో తెలుస్తుందని రాహుల్ గాంధీ అన్నారు. ఇక గుజరాత్ రాష్ట్రంలోని మోర్బీలో సస్పెన్షన్ బ్రిడ్జి కూలిన గతంలో 134 మంది మృతి చెందిన అంశంపై మీడియా అడిగిన ప్రశ్నకు రాహుల్ గాంధీ సమాధానమిస్తూ, మోర్బీ విషాదాన్ని రాజకీయం చేయనని, అక్కడ ప్రజలు చనిపోయారని, విషాదంలో ఉన్నారని అన్నారు. ఈ మీడియా సమావేశంలో రాహుల్ గాంధీతో పాటుగా టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పలువురు నేతలు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE