ఏపీ మాజీ మంత్రి నారాయణకు షాక్, పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో బెయిల్ రద్దు

AP Ex-Minister Narayana Bail Cancelled in SSC Question Paper Leakage Case by Chittoor Court, AP Ex-Minister Narayana, Narayana Bail Cancelled, Narayana Accused in SSC Question Paper Leakage, AP SSC Question Paper Leakage Case, Chittoor Court Cancelled Bail To Narayana, Narayana Educational Institutions, Mango News, Mango News Telugu, Chittoor Court, AP CM YS Jagan Mohan Reddy, YS Jagan News And Live Updates, YSR Congress Party, Andhra Pradesh News And Updates, AP Politics, Janasena Party, TDP Party, YSRCP, Political News And Latest Updates

ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల వ్యవస్థాపకులు నారాయణకు షాక్ తగిలింది. ఏపీలో ఈ ఏడాది వెలుగుచూసిన పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ ఘటనలో ఆయన బెయిల్ పిటిషన్ రద్దు అయింది. ఈ మేరకు సోమవారం చిత్తూరు తొమ్మిదో అదనపు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నవంబర్‌ 30 లోపు మాజీ మంత్రి నారాయణ పోలీసుల ఎదుట లొంగిపోవాలని కోర్టు పేర్కొంది. ఈ కేసులో నారాయణకు బెయిల్‌ ఇవ్వడం సమంజసం కాదని, రద్దు చేయాలని చిత్తూరు వన్ టౌన్ పోలీసులు పిటీషన్ దాఖలు చేయగా కోర్టు విచారణ జరిపింది. కాగా ఈ ఏడాది ఏప్రిల్‌ 27వ తేదీన చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం నెల్లేపల్లిలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రశ్నాపత్రం లీకైంది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. నారాయణ విద్యాసంస్థలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడు పదో తరగతి పరీక్ష ప్రశ్నాపత్రాన్ని లీక్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

పరీక్ష ప్రారంభమైన ఒక గంట తర్వాత అతను ప్రశ్నాపత్రాన్ని ఫోటో తీసి సోషల్ మీడియా గ్రూప్‌లో పోస్ట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. దర్యాప్తులో భాగంగా ఈ ఘటనలో మాజీ మంత్రి నారాయణ పాత్ర ఉన్నట్లు అనుమానించిన పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం హైదరాబాద్‌లో ఆయనను అరెస్ట్ చేసి చిత్తూరు కోర్టులో హాజరుపరిచారు. అయితే నారాయణ విద్యాసంస్థల అధినేతగా 2014 లోనే ఆయన తప్పుకున్నారని ఆయన తరఫు న్యాయవాదులు ఆధారాలను కోర్టుకు సమర్పించడంతో కోర్టు అప్పట్లో బెయిల్‌ మంజూరు చేసింది. ఈ క్రమంలో చిత్తూరు పోలీసులు దాఖలు చేసిన పిటీషన్ విచారణ సందర్భంగా తాజాగా ఆ బెయిల్‌ను రద్దు చేసింది. ఇక ఈ కేసుకి సంబంధించి మొత్తం ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. వారిలో ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులు కాగా, మిగిలిన వారు నారాయణ విద్యాసంస్థల సిబ్బంది కావడం గమనార్హం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 − one =