
తెలంగాణ ఎన్నికలు దగ్గర పడుతోన్న కొద్దీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతోన్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ , బీఆర్ఎస్ మధ్యనే ప్రధాన పోటీ కొనసాగుతుండగా.. సామాజిక సమీకరణాల ఆధారంగా బీజేపీ ముందుకు వెళ్తోంది.
ఇప్పటికే సీఎం నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, అభ్యర్ధులు, కార్యకర్తల ప్రచారాల హోరుతో తెలంగాణ హీటెక్కిపోతోంది.బీఆర్‌నేతలు కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన అభివృద్ధి సున్నా.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాతే తెలంగాణ రూపురేఖలు, తెలంగాణవాసుల బతుకులు మారాయంటూ చెప్పుకొస్తున్నారు. ఇదే అంశాన్ని కాంగ్రెస్ నేతలు కూడా చెబుతున్నారు. ఈ పదేళ్లలో గులాబీ పార్టీ నేతలు ఇచ్చిన మాటలు తప్పడం తప్ప ఏం చేశారంటూ విమర్శిస్తున్నారు.
ముఖ్యంగా ఈ మధ్య మంత్రి కేటీఆర్ రైతు బంధు పైన చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు హైలెట్ చేసి..ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే రైతు బంధు అమలు చేసే విషయంలో పరిమితులు గురించి చేసిన కేటీఆర్ చేసిన కామెంట్లను వ్యాఖ్యలను కాంగ్రెస్ తన అస్త్రంగా మార్చుకుంది.ఇప్పటికే గులాబీ పార్టీ పైన వినూత్న ప్రచారాలు చేస్తూ దూసుకుపోతోంది. గతంలో కేసీఆర్ ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ అందులో అమలు కాని హామీలపై ఫోకస్ చేస్తూ.. డిజిటల్ మీడియా ప్రచారం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తుంది.
కాంగ్రెస్ తాజాగా ఇచ్చిన గ్యారంటీ పథకాలకు పోటీగా బీఆర్ఎస్ తన మేనిఫెస్టోను ప్రకటించింది. బీఆర్ఎస్ నేతలంతా ప్రతీ నియోజకవర్గాన్ని చుట్టేస్తూ..మేనిఫెస్టోను చూపిస్తూ ఓటర్లను తమ వైపు తిప్పుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు.రైతు బంధు పథకం ద్వారా ఇప్పటి వరకూ బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు రూ .10 వేలు ఇస్తోంది.
అయితే కాంగ్రెస్ రైతు బంధు పథకంలో బీఆర్ఎస్ ఇచ్చే రూ.10 వేలు కాదు.. తాము అధికారంలోకి వస్తే రూ .15 వేలకు పెంచుతామని హామీ ఇచ్చింది. ఈ వెంటనే సీఎం కేసీఆర్ దీనిని రూ .16 వేలు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇదే సమయంలో మంత్రి కేటీఆర్ రైతుబంధుకు సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు కాంగ్రెస్‌కు ఎన్నికల అస్త్రం లభించినట్లుయింది.
ఇటీవల తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య సమావేశంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్.. రైతు బంధు పథకం విషయంలో భూ పరిమితి పెట్టాలనే అభిప్రాయం ఉన్నట్లు చెప్పుకొచ్చారు.తాము తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బంధుపై పరిమితి అంశాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఈ పథకం కింద లబ్ధి పొందే రైతులకు ఉండాల్సిన భూమిని.. 4 లేదా 5 ఎకరాలకు పరిమితం చేయటం గురించి పరిశీలిస్తామని చెప్పారు.
ఎక్కువ భూమి ఉన్న రైతులు తెలంగాణలో చాలా మంది ఉన్నారని.. దీంతో అంతే స్థాయిలోవారికి రైతుబంధు నగదు లభిస్తుందని కేటీఆర్ అన్నారు.
కేటీఆర్ చేసిన వ్యాఖ్యలనే తమకు అనుకూలంగా మార్చుకుని ఇప్పుడు కాంగ్రెస్ తమ ప్రచారాస్త్రంగా మార్చుకుంటోంది. రైతుబంధు పథకాన్ని తమ ఘనతగా చెప్పుకుంటున్న బీఆర్ఎస్..మళ్లీ అధికారంలోకి వస్తే పరిమితులు విధిస్తామని చెప్పటం ద్వారా రైతులకు నష్టం జరుగుతుందన్న సంకేతాలను కాంగ్రెస్ ప్రజల్లోకి తీసుకెళ్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE