కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ 5 రాష్ట్రాలకు రూ.1751.05 కోట్ల అదనపు కేంద్ర సహాయానికి ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకుంది. 2020 వ సంవత్సరంలో నైరుతి రుతుపవనాల సందర్భంగా వరదలు/కొండచరియలు విరిగిపడడంతో నష్టంతో పాటుగా 2019-20 రబీ సమయంలో వడగళ్ళు వానలతో నష్టపోయిన అస్సాం, తెలంగాణ అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా మరియు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలకోసం ఈ నిధులను కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి (ఎన్‌డిఆర్‌ఎఫ్) నుంచి 5 రాష్ట్రాలకు రూ.1751.05 కోట్ల సహాయాన్ని అందిస్తున్నట్టు పేర్కొన్నారు. అలాగే 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ కేంద్ర ప్రభుత్వం ఎస్‌డిఆర్‌ఎఫ్ నుంచి 28 రాష్ట్రాలకు రూ.19,036.43 కోట్లు, ఎన్‌డిఆర్‌ఎఫ్ నుంచి 11 రాష్ట్రాలకు రూ.4,409.71 కోట్లను విడుదల చేసినట్టు తెలిపారు.
కేంద్రం నుంచి అదనపు సాయం పొందిన రాష్ట్రాలివే:
- అస్సాం – రూ.437.15 కోట్లు
- తెలంగాణ – రూ.245.96 కోట్లు
- ఉత్తరప్రదేశ్ – రూ.386.06 కోట్లు
- ఒడిశా – రూ.320.94 కోట్లు
- అరుణాచల్ ప్రదేశ్ – రూ.75.86 కోట్లు
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ