హస్తం గూటికి చంద్రశేఖర్ రెడ్డి

Chandrashekar reddy, allu arjun, telangana, congress,TPCC,telangana updates,Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Mango News Telugu, Mango News
Chandrashekar reddy, allu arjun, telangana, congress

గులాబీ పార్టీకి బిగ్ షాకులు తగులుతున్నాయి. ఒకటి పోతే మరొకటి వరుసగా.. ఎదురుదెబ్బలు ఎదురవుతూనే ఉన్నాయి. తెలంగాణలో అధికారం కోల్పోయినప్పటి నుంచి బీఆర్ఎస్‌కు కష్టాలు తప్పడం లేదు. లోక్ సభ ఎన్నికల్లోనైనా తమ హవా చాటాలని ప్రయత్నిస్తోన్న బీఆర్ఎస్‌కు.. సొంత నేతల నుంచే ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. పెద్ద ఎత్తున నేతలు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి.. అధికార కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీ సీనియర్లు, కీలక నేతలు కూడా బీఆర్ఎస్‌ను వీడేందుకు వెనుకాడడం లేదని.. కాంగ్రెస్ వైపు చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

ఇదే సమయంలో సీనియర్ నేత, స్టార్ హీరో అల్లు అర్జున్‌ మామ చంద్రశేఖర్ రెడ్డి బీఆర్ఎస్‌కు ఊహించని షాక్ ఇచ్చారు.  కారు దిగుతున్నట్లు ప్రకటించారు. బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి.. అధికార కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు చంద్రశేఖర్ అధికారికంగా ప్రకటించారు. త్వరలో రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకుంటానని వెల్లడించారు. తాను తెలంగాణ వాదినన్న చంద్రశేఖర్.. తనకు బీఆర్ఎస్‌లో అనువనువునా అన్యాయం జరిగిందని ఆరోపించారు. అందుకే బీఆర్ఎస్‌కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రశేఖర్ బీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించారు. కానీ హైకమాండ్ ఆయనకు మొండి చేయి చూపించింది. టికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఈక్రమంలో లోక్ సభ ఎన్నికల్లోనైనా తనకు టికెట్ దక్కుతుందనే ఉద్దేశంతో చంద్రశేఖర్ అప్పుడు సర్దుకుపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు కోసం పనిచేశారు. ఇక ఇప్పుడు లోక్ సభ ఎన్నికల టైమ్ వచ్చేసింది. అయితే ఈసారి కూడా ఆయనకు టికెట్ దక్కే అవకాశాలు కనిపించడం లేదు. చంద్రశేఖర్‌కు ఎంపీ టికెట్ ఇచ్చేందుకు బీఆర్ఎస్ హైకమాండ్ వెనుకడుగు వేస్తోందట.

ఈక్రమంలో టికెట్ ఆశించి భంగపడిన చంద్రశేఖర్ బీఆర్ఎస్‌ను వీడాలని నిర్ణయించుకున్నారు. గతంలో చంద్రశేఖర్ రెడ్డి యూత్ కాంగ్రెస్‌లో పనిచేశారు. ఈక్రమంలో తన పేరెంట్ పార్టీలోకి వెళ్తున్నట్లు చంద్రశేఖర్ వెల్లడించారు. పార్టీలో చేరిన తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ సూచనలకు కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని ప్రతి గల్లి గల్లి తనకు తెలుసునని.. గ్రేటర్‌లోని ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారని పేర్కొన్నారు. హైదరాబాద్, మల్కాజ్‌గిరిలో ఏ టికెట్ ఇచ్చినా పోటీ చేస్తానని.. తన కోసం అల్లు అర్జున్‌తో పాటు తన కుటుంబ సభ్యులంతా ప్రచారం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని చంద్రశేఖర్ రెడ్డి చెప్పుకొచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE