వైసీపీ పాలన ఎలా ఉంది..? ప్రజలు ఏమంటున్నారు?

YCP's rule, CM Jagan, AP, AP Elections, YSRCP,YV Subba Reddy,Andhra Pradesh News Updates, AP Political News, AP Latest news and Updates, AP Politics,andhra pradesh, jagan latest updates,ap political updates,Mango News Telugu, Mango News
YCP's rule, CM Jagan, AP, AP Elections

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అయిదేళ్లు కావస్తోంది. గత ఎన్నికలవేళ నవరత్నాల పేరుతో మేనిఫెస్టోను ప్రకటించి సక్సెస్ అయ్యారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. అయిదేళ్లలో వందకు 99 శాతం హామీలను అమలు చేశామని జగన్ చెబుతున్నారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలొచ్చాయి. అయిదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న తెలుగు దేశం పార్టీ ఈసారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని పావులు కదుపుతోంది. ఈ మేరకు జనసేనతో పొత్తు పెట్టుకొని వైసీపీని ఢీ కొట్టేందుకు సిద్ధమవుతోంది. అటు వైసీపీ రెండోసారి అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరుతోంది.

అయితే ఎన్నికలు దగ్గరపడుతున్నవేళ పలు సంస్థలు సర్వే చేసి సంచలన విషయాలు బయటపెడుతున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీల భవితవ్యాన్ని ముందే తేల్చేస్తున్నాయి. ఇక ప్రతివారంలానే ఈవారం కూడా ఎన్నికల చిత్రలహరి నివేదిక వచ్చేసింది. ఈవారం అసలు వైసీపీ అయిదేళ్ల పాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు?.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు ఎంతవరకు అందాయి? వైసీపీ పథకాల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు?.. ఏయో అంశాల్లో వైసీపీ ప్రభుత్వం పట్ల ప్రజలు అసంతృప్తితో ఉన్నారు? అనే అంశంపై సర్వే చేసి సంచలన విషయాలను వెలికితీశారు.

ఎన్నికల చిత్రలహరి నివేదిక ప్రకారం.. సీఎం జగన్మోహన్ రెడ్డి అయిదేళ్ల పాలనపై 30 శాతం మంది ప్రజలు ఆగ్రహంతో వున్నారు. 32 శాతం మంది ప్రజలు జగన్ పాలనపట్ల సంతృప్తితో ఉన్నారు. మరో 14 శాతం మంది జగన్ పాలన పట్ల గర్వంగా ఫీల్ అవుతుంటే.. 11 శాతం మంది మాత్రం అసంతృప్తితో ఉన్నారు. మరో 13 శాతం మంది మాత్రం జగన్ పాలనపై తమ అభిప్రాయాన్ని తెలపలేకపోయారు. అదే సమయంలో రాష్ట్రంలో రోడ్ల విషయంలో 39 శాతం మంది.. అభివృద్ధి లేకపోవడం పట్ల 31 శాతం మంది.. ఉపాధి కల్పించలేకపోవడం వల్ల 28 శాతం మంది.. ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేయలేకపోవడం వల్ల 27 శాతం మంది ప్రజలు జగన్ పాలనపై అసంతృప్తితో వున్నారు.

అటు జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్ల 46 శాతం మంది ప్రజలు.. వాలంటీర్ల వ్యవస్థ వల్ల 31 శాతం మంది ప్రజలు.. విద్యా సంస్కరణల పట్ల 28 శాతం మంది ప్రజలు.. ఉచితంగా పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వడం పట్ల 23 శాతం మంది ప్రజలు.. ఆరోగ్య సంరక్షణ పట్ల 13 శాతం మంది ప్రజలు సంతోషంగాగా ఉన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − 9 =